Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IND vs IRE : బీసీసీఐకి కొత్త టెన్షన్.. టీమిండియా ఐర్లాండ్ పర్యటన రద్దవుతుందా?

12 June 2026

చమురు కొనుగోలుపై విమర్శలా..? యూరప్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన విదేశాంగ మంత్రి!

12 June 2026

రాజకీయాల్లోకి వస్తున్నా.. కానీ మీరు చెబితేనే – రాఘవ లారెన్స్ | actor Raghava Lawrence tweets about political entry and requesting fans opinions goes viral on social media

12 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Godavari Water Level Rises,ఏపీకి గోదావరి టెన్షన్.. ఈ జిల్లాల్లో హై అలర్ట్, ఒక్కరాత్రిలో వరద అంత పెరిగిందా! – andhra pradesh government officials alert people after godavari flood
ఆంధ్రప్రదేశ్

Godavari Water Level Rises,ఏపీకి గోదావరి టెన్షన్.. ఈ జిల్లాల్లో హై అలర్ట్, ఒక్కరాత్రిలో వరద అంత పెరిగిందా! – andhra pradesh government officials alert people after godavari flood

.By .11 September 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Godavari Water Level Rises,ఏపీకి గోదావరి టెన్షన్.. ఈ జిల్లాల్లో హై అలర్ట్, ఒక్కరాత్రిలో వరద అంత పెరిగిందా! – andhra pradesh government officials alert people after godavari flood
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఆంధ్రప్రదేశ్‌ను మొన్నటి వరకు కృష్ణానది ముంచెత్తితే.. ఇప్పుడు గోదావరి వరద టెన్షన్ పెడుతోంది. ఒక్కసారిగా వరద పెరగడంతో.. గోదావరి తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది. వెంటనే అప్రమత్తమైన ఇరిగేషన్‌శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయానికి.. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ దగ్గర గోదావరి నీటి మట్టం 11.75 అడుగులకు చేరింది. బ్యారేజ్ గేట్లు ఎత్తి 10 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర రాత్రి 10 గంటల సమయానికి నీటి మట్టం 12.60 అడుగులకు చేరింది.. దీంతో అధికారులు 10.97 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు.ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం 13.75 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బుధవారం ఉదయానికి గోదావరి దగ్గర నీటిమట్టం మరికొంత పెరిగింది. ఎగువ రాష్ట్రాల నుంచి కలుస్తున్న వరద జలాలు కొండ వాగులు జలాలతో గోదావరి నీటిమట్టం బుధవారం అనూహ్యంగా పెరిగింది. గోదావరి తీర ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి గోదావరి వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు.. అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ అవసరమైన ఆహారం, తాగునీరు, హెల్త్ సర్వీసులు ఏర్పాటు చేశారు. గోదావరిలో చేపల వేటను కూడా నిషేధించారు.. మత్స్యకారులు ఎవరూ నదిలోకి దిగొద్దని హెచ్చరించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే దగ్గర 13.37 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తోంది.

అలాగే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద పెరుగుతోంది.. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ముంపు వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అంతేకాదు గోదావరి, శబరి నదులకు వరద పెరగడంతో.. ముంపు ప్రాంత ప్రజలు ఆందోళనలో ఉన్నారు. గోదావరికి వరద పెరుగుతుండటంతో తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు.

మరోవైపు భద్రాచలం దగ్గర గోదావరికి వరద పోటెత్తెంది.. ఒక్కసారిగా నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువన ఉన్న ఇంద్రావతి నుంచి భారీగా వరద నీరు రావడంతో.. గోదావరిలో నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. భద్రాచలం దగ్గర మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయానికి.. గోదావరి వరద 48 అడుగుల వరకు ఉంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.. వెంటనే కరకట్టపై రాకపోకలను నిలిపివేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం మురుమూరు దగ్గర గోదావరి పోటెత్తింది. అక్కడ ప్రధాన రహదారిపైకి వరద చేరడంతో కూనవరంతో పాటుగా వర రామచంద్రాపురం మండలాలకు భద్రాచలం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

రాజమహేంద్రవరం నుంచి పైలట్లకు రెక్కలు.. రాష్ట్ర తొలి ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి శ్రీకారం!

12 June 2026

Srikakulam Harini Murder Case Updates,శ్రీకాకుళం పురువు హత్య.. చావును ముందే ఊహించిన హరిణి?, పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు – police reveals key points in srikakulam harini murder case

12 June 2026

Raghurama Letter To Dgp On Sc Atrocity Cases,ఏపీలో వారి ఎస్సీ హోదాను ధ్రువీకరించాలి.. డిప్యూటీ స్పీకర్ రఘురామ లేఖ – ap deputy speaker raghu rama krishna raju wrote a letter to dgp on filing cases under sc st atrocities act

12 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

IND vs IRE : బీసీసీఐకి కొత్త టెన్షన్.. టీమిండియా ఐర్లాండ్ పర్యటన రద్దవుతుందా?

12 June 2026

IND vs IRE : భారత క్రికెట్ జట్టు రాబోయే రోజుల్లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ రెండు…

చమురు కొనుగోలుపై విమర్శలా..? యూరప్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన విదేశాంగ మంత్రి!

12 June 2026

రాజకీయాల్లోకి వస్తున్నా.. కానీ మీరు చెబితేనే – రాఘవ లారెన్స్ | actor Raghava Lawrence tweets about political entry and requesting fans opinions goes viral on social media

12 June 2026

నిర్మాతల తప్పులు.. వాళ్లపై నిందలు..!

12 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

IND vs IRE : బీసీసీఐకి కొత్త టెన్షన్.. టీమిండియా ఐర్లాండ్ పర్యటన రద్దవుతుందా?

12 June 2026

చమురు కొనుగోలుపై విమర్శలా..? యూరప్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన విదేశాంగ మంత్రి!

12 June 2026

రాజకీయాల్లోకి వస్తున్నా.. కానీ మీరు చెబితేనే – రాఘవ లారెన్స్ | actor Raghava Lawrence tweets about political entry and requesting fans opinions goes viral on social media

12 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025566

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025523

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.