బాలీవుడ్ హీరోయిన్, మోడల్ మలైకా అరోరా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన నివాసం టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అంనతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Actor-model Malaika Arora’s father commits suicide by jumping from building in Mumbai: Police
— Press Trust of India (@PTI_News) September 11, 2024

