హాస్యబ్రహ్మా.. దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్గా కొనసాగుతున్నారు. పెద్ద చిత్రాల నుంచి చిన్న సినిమాల వరకు ప్రతి చిత్రంలోనూ మోస్ట్ వాంటెడ్ కమెడియన్. ఒకప్పుడు చేతినింండా సినిమాలతో ఎంతో బిజీగా ఉండేవారు. బ్రహ్మానందం డేట్స్ కోసం స్టార్ హీరోస్ సైతం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. యాక్టింగ్, డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్తో వెండితెరపై నవ్వులు పూయిస్తారు. సినిమాల్లో అగ్ర కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన బ్రహ్మానందం.. కొన్నాళ్లుగా సినిమాల్లో అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. అలాగే అటు కామెడీ రోల్స్ కూడా పెద్దగా చేయడం లేదు. కానీ ఇప్పుడిప్పుడే వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం రంగమార్తండ సినిమాలో తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన రంగమార్తండ చిత్రంలో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో బ్రహ్మానందం నటన చూసి ప్రేక్షకులు కళ్లు చెమ్మగిల్లాయి.ఆయన అభినయానికి విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఆ స్థాయిలో తన నటన విశ్వరూపం చూపించిన బ్రహ్మానందం మరోసారి తనలోని నటన ప్రతిభను చూపించనున్నారు. ప్రస్తుతం హీరోయిన్ రెజీనా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఉత్సవం సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ 13న విడుదల కానుంది.ఈ క్రమంలోనే తాజాగా బ్రహ్మానందంకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది చిత్రయూనిట్.
ఇవి కూడా చదవండి
ఉత్సవం సినిమా రంగస్థల నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో బ్రహ్మానందం దుర్యోధనుడి గెటప్ లో కనిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్రహ్మానందం దుర్యోధనుడిగా భారీ డైలాగ్ చెబుతున్న నిమిషం వీడియో ఒకటి తెగ ట్రెండ్ అవుతుంది. అందులో బ్రహ్మానందం మరోసారి డైలాగ్స్ అదరగొట్టారు. ఇన్నాళ్లు కేవలం హాస్యనటుడిగానే నవ్వించిన ఆయన.. ఇప్పుడు అద్భుతమైన నటనతో విశ్వరూపం చూపిస్తున్నారు. కొన్నాళ్లుగా రంగమార్తండ సినిమాలో బ్రహ్మానందం యాక్టింగ్ వీడియో ట్రెండ్ అవుతుండగా.. ఇప్పుడు దుర్యోధనుడి పాత్రలో డైలాగ్స్ చెబుతుంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బ్రహ్మానందం దుర్యోధనుడి గెటప్ వీడియో..
#UtsavamMovie బ్రహ్మానందం గారిని మనం కామెడీ పాత్రలకే పరిమితం చేసి తప్పు చేసావేమో? pic.twitter.com/cMrMIuhQ9Y
— devipriya (@sairaaj44) September 10, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

