మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన సినిమా మిస్టర్ బచ్చన్. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ రైడ్ ను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి పక్కా కమర్షియల్ హంగులతో ఈ సినిమాను రూపొందించారు డైరెక్టర్ హరీశ్ శంకర్. గతంలో రవితేజ- హరీష్ శంకర్ కాంబినేషన్ లో షాక్, మిరపకాయ సినిమాలు వచ్చాయి. ఇది ముచ్చటగా మూడో సినిమా. దీనికి తోడు రిలీజ్ కు ముందే మిస్టర్ బచ్చన్ పాటలు, పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న గ్రాండ్ గా మిస్టర్ బచ్చన్ థియేటర్లలో రిలీజైంది. కానీ మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ అయ్యింది. రివ్యూలూ కూడా నెగెటివ్ గా వచ్చాయి. దీంతో మిస్టర్ బచ్చన్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చింది. అయితే ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో రవితేజ అభిమానులను అలరించాడు. అలాగే కొత్త హీరోయిన్, భాగ్యశ్రీ భోర్సే అందాలు, హుషారైన డ్యాన్స్ లు, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ మిస్టర్ బచ్చన్ సినిమాను కొంతలో కొంత నిలబెట్టాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను నిరాశపర్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మిస్టర్ బచ్చన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 12 నుంచే రవితేజ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే మిస్టర్ బచ్చన్ మూవీ ఓటీటీలో సందడి చేయనుందన్నమాట. కాగా ఈ సినిమాకూడా నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తుండడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నూ మిస్టర్ బచ్చన్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా మిస్టర్ బచ్చన్ సినిమాను నిర్మించారు. జగపతి బాబు విలన్ గా నటించారు. అలాగే కమెడియన్ సత్య, ప్రవీణ్, ఝూన్సీ, సచిన్ ఖేడ్కర్, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మిక్కీజే మేయర్ తన కెరీర్ లో మొదటి సారి ఊర మాస్ పాటలు అందించారు. ఇవి ఇప్పటికీ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
Sarihaddhu ni kaapade sainikuduni choosuntaru, sampadha ni kaapade sainikuduni ippudu choostharu. #MrBachchan is coming to Netflix on 12 September in Tamil, Telugu, Malayalam and Kannada! #MrBachchanOnNetflix pic.twitter.com/mlCoioO0vS
— Netflix India South (@Netflix_INSouth) September 7, 2024
మిస్టర్ బచ్చన్ ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

