Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కొత్త కుర్రాడి మీద కోటి బడ్జెట్ అవసరమా అన్నారు.. కట్ చేస్తే.. 2000లో బాక్సాఫీస్ షేక్.. 26 ఏళ్లుగా ట్రెండింగ్ మూవీ..

12 June 2026

దిమ్మ తిరిగే షాక్! బంగారంతో పోటీ పడుతున్న వెండి.. నేటి ధరలు ఇవే | Gold Price Skyrockets To Rs 152200 In Hyderabad; Silver Rates Jump By Rs 9000 Per KG In A Single Day

12 June 2026

సూర్య చేయాలనుకున్న కథతో రజనీ సినిమా

12 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tiruvuru Mla Kolikapudi Srinivasa Rao,దమ్ముంటే రాజీనామా చేయ్.. చూసుకుందాం.. వైఎస్‌ జగన్‌‍కు టీడీపీ ఎమ్మెల్యే ఛాలెంజ్ – tiruvuru mla kolikapudi srinivasa rao challenge to ys jagan on resignation of pulivendula mla post
ఆంధ్రప్రదేశ్

Tiruvuru Mla Kolikapudi Srinivasa Rao,దమ్ముంటే రాజీనామా చేయ్.. చూసుకుందాం.. వైఎస్‌ జగన్‌‍కు టీడీపీ ఎమ్మెల్యే ఛాలెంజ్ – tiruvuru mla kolikapudi srinivasa rao challenge to ys jagan on resignation of pulivendula mla post

.By .11 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tiruvuru Mla Kolikapudi Srinivasa Rao,దమ్ముంటే రాజీనామా చేయ్.. చూసుకుందాం.. వైఎస్‌ జగన్‌‍కు టీడీపీ ఎమ్మెల్యే ఛాలెంజ్ – tiruvuru mla kolikapudi srinivasa rao challenge to ys jagan on resignation of pulivendula mla post
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



Kolikapudi Srinivasa rao Challenge to YS Jagan: ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న వైసీపీ నేతలు, ప్రభుత్వ తీరుపై ప్రశ్నలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే రెండుపార్టీల నేతల మధ్యల మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా బుధవారం గుంటూరు జైలులో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. ఆయనతో ములాఖత్ అయిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన జగన్.. టీడీపీ తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందన్న వైఎస్ జగన్.. మళ్లీ తాము అధికారంలోకి వస్తామని మరిచిపోవద్దని హెచ్చరించారు. రెడ్ బుక్ ఒకరికే సొంతం కాదన్న జగన్.. ఐదేళ్ల తర్వాత మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ నేతలను ఇదే జైలుకు పంపుతామంటూ వార్నింగ్ ఇచ్చారు.ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నుంచి, ప్రభుత్వం నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. ఇప్పటికే మంత్రులు నిమ్మల రామానాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వంటి నేతలు వైఎస్ జగన్‌ను కౌంటరిచ్చారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టడం వెనుక వైసీపీ కుట్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. వైఎస్‌ జగన్‌కు సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అది చేయలేదు, ఇది చేయలేదంటున్న వైఎస్ జగన్.. ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని భావిస్తే రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. తాను తిరువూరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. జగన్ పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. అప్పుడు ప్రజామోదం ఎవరికి ఉందో తెలిసిపోతుందంటూ సవాల్ విసిరారు.

“శాసనసభలో అన్ని విషయాలపైనా శ్వేతపత్రాలు విడుదల చేశాం. చర్చకు అవకాశం ఇచ్చాం. ఆరోజు పారిపోయాడు. ఈ రోజు నాలుగు పేపర్లు పట్టుకుని గుంటూరు జైలు ముందు నిలబడి.. అది చేయలేదు, ఇది చేయలేదంటున్నాడు. మా ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తోంది. నిజంగా నువ్వు అనుకున్నట్లు మా ప్రభుత్వానికి, మా కూటమికి ప్రజలు ఇచ్చిన తీర్పుపట్ల అనుమానం ఉంటే.. తిరువూరు ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా. పులివెందుల ఎమ్మెల్యే పదవికి నువ్వు రాజీనామా చేయ్. నేను నా పార్టీ తరుఫున, నువ్వు నీ పార్టీ తరుఫున పోటీ చేయ్. ఎవరికి ప్రజల ఆమోదం ఉందో తెలిసిపోతుంది. ఇష్టానుసారం మాట్లాడితే.. చట్టపరిధిలో ఎవరినీ వదిలేది లేదు. వరద బాధితుల పరామర్శకు, కుటుంబసభ్యులు అనారోగ్యంతో ఉంటే చూడ్డానికి వెళ్లని వైఎస్ జగన్.. జైళ్లో ఉన్న నందిగం సురేష్‌ను చూడ్డానికి వెళ్లారంటేనే ఆయన ప్రాధాన్యం దేనికో అర్థమవుతోంది. ” అంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఓ రేంజులో ఫైరయ్యారు.

అయితే అమరావతి ఉద్యమనేతగా ఉన్న కొలికపూడి శ్రీనివాసరావుకు టీడీపీ తొలిసారిగా సీటు ఇచ్చింది. తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు అవకాశం కల్పించింది. కూటమి సునామీలో తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాసరావు తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. అటు వైఎస్ జగన్ పులివెందుల నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

రాజమహేంద్రవరం నుంచి పైలట్లకు రెక్కలు.. రాష్ట్ర తొలి ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి శ్రీకారం!

12 June 2026

Srikakulam Harini Murder Case Updates,శ్రీకాకుళం పురువు హత్య.. చావును ముందే ఊహించిన హరిణి?, పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు – police reveals key points in srikakulam harini murder case

12 June 2026

Raghurama Letter To Dgp On Sc Atrocity Cases,ఏపీలో వారి ఎస్సీ హోదాను ధ్రువీకరించాలి.. డిప్యూటీ స్పీకర్ రఘురామ లేఖ – ap deputy speaker raghu rama krishna raju wrote a letter to dgp on filing cases under sc st atrocities act

12 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

కొత్త కుర్రాడి మీద కోటి బడ్జెట్ అవసరమా అన్నారు.. కట్ చేస్తే.. 2000లో బాక్సాఫీస్ షేక్.. 26 ఏళ్లుగా ట్రెండింగ్ మూవీ..

12 June 2026

ప్రముఖ దర్శకుడు కే. విజయ భాస్కర్, తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే నువ్వే కావాలి వంటి విజయవంతమైన చిత్రం తర్వాత…

దిమ్మ తిరిగే షాక్! బంగారంతో పోటీ పడుతున్న వెండి.. నేటి ధరలు ఇవే | Gold Price Skyrockets To Rs 152200 In Hyderabad; Silver Rates Jump By Rs 9000 Per KG In A Single Day

12 June 2026

సూర్య చేయాలనుకున్న కథతో రజనీ సినిమా

12 June 2026

బల్లూకం బీభత్సం భయం.. చీకటి పడితే చాలు, వణుకుతున్న గ్రామం..!

12 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

కొత్త కుర్రాడి మీద కోటి బడ్జెట్ అవసరమా అన్నారు.. కట్ చేస్తే.. 2000లో బాక్సాఫీస్ షేక్.. 26 ఏళ్లుగా ట్రెండింగ్ మూవీ..

12 June 2026

దిమ్మ తిరిగే షాక్! బంగారంతో పోటీ పడుతున్న వెండి.. నేటి ధరలు ఇవే | Gold Price Skyrockets To Rs 152200 In Hyderabad; Silver Rates Jump By Rs 9000 Per KG In A Single Day

12 June 2026

సూర్య చేయాలనుకున్న కథతో రజనీ సినిమా

12 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025566

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025523

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.