మోస్ట్ అవైటెడ్ దేవర ట్రైలర్ వచ్చేసింది.. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అన్నట్లు ట్రైలర్ ఉంటుందంటూ టీం చెప్పారు. మరి నిజంగానే వాళ్లు చెప్పిన స్థాయిలో ఉందా.? కొరటాలను ఆచార్య చేదు జ్ఞాపకాల నుంచి దేవర బయటపడేస్తాడా.? అసలు దేవర ట్రైలర్‌లో ఈ విషయాలు ఎంతమంది గమనించారు.?
ఎన్టీఆర్‌లో ఈ రేంజ్ మాస్‌ను రాజమౌళి చూపించేసాక.. ఆ తర్వాత దర్శకులకు ఏం మిగులుతుంది చూపించడానికి.! అయినా కొరటాల సాహసం చేస్తున్నారు. దేవర ట్రైలర్ చూసాక ఈయన మేకింగ్ స్టైల్ మారిపోయిందని అర్థమవుతుంది.
ఇదివరకు సినిమాల్లో నేటివిటీ ఉండేది.. కానీ ఇప్పుడు దేవరలో మాత్రం యూనివర్సల్ అప్పీల్ కనబడుతుంది. దేవర సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి కూడా విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు ట్రైలర్‌లోనూ కనిపించింది.
2 నిమిషాల 40 సెకన్లలో విజువల్ ఫీస్ట్ చూపించారు కొరటాల. అలాగే టెక్నికల్ వర్క్ కూడా అద్భుతంగా ఉంది. సముద్రంలోని విజువల్ షాట్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్‌లోనే ఇలా ఉంటే.. రేపు సినిమా మన ఊహకే వదిలేస్తున్నారు కొరటాల.
దేవర ట్రైలర్‌లో చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం ఆర్ట్ వర్క్. ఈ సినిమా కోసం సముద్రాన్నే రీ క్రియేట్ చేస్తున్నారు. ట్రైలర్‌లోనూ దీన్ని బాగా హైలైట్ చేసారు. ముఖ్యంగా సముద్రంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్.. అండర్ వాటర్‌లో కనిపించే అస్తి పంజరాలు.. ఈ షాట్స్ అన్నీ అదిరిపోయాయి.
ఇవన్నీ ఒకెత్తు అయితే.. అనిరుధ్ RR మరో ఎత్తు. టెక్నికల్ వర్క్ తర్వాత దేవర ట్రైలర్‌లో హైలైట్ జూనియర్ ఎన్టీఆర్. మలయాళం మినహా అన్ని భాషల్లోనూ ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు.
అనుకోని పరిస్థితుల్లో దేవర మిస్ అవ్వడం.. అప్పటి వరకు పిరికివాడిగా ఉన్న దేవర కొడుకు తన వాళ్ల కోసం నిలబడటం ట్రైలర్‌లో చూపించారు. సెప్టెంబర్ 27న విడుదల కానుంది దేవర పార్ట్ 1. మరి చూడాలిక.. తారక్ మాస్ జాతర ఎలా ఉండబోతుందో.?








