
ప్రస్తుతం విద్యా సంవత్సవరం మధ్యలో ఉంది.. ఇలాంటి సమయంలో వెంకటరమణారెడ్డిని అక్కడి నుంచి మరో చోటికి బదిలీ చేస్తారా అన్నది చూడాలి. ఆయన మాత్రం ఉర్దూ స్కూల్ కావడంతో ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. అందుకే తాను డీఈవోకు లేఖ రాసి తన సమస్యను చెప్పుకున్నాను అంటున్నారు. మొత్తం మీద ఈ విచిత్రమైన సమస్య గురించి తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. మరి అధికారులు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి.
వరద బాధితులకు సాయం
విజయవాడ వరద బాధితులకు రాయలసీమ డయాసిస్ బిషప్ ఐజక్ వరప్రసాద్ సాయం అందించారు. తమ వంతు చేయూతగా 15 రకాల నిత్యావసర సరకుల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ వ్యాప్తంగా చర్చిల ద్వారా వీటిని సేకరించినట్లు తెలిపారు. సుమారు రూ.20 లక్షల విలువ చేసే నిత్యావసరాలను విజయవాడకు పంపించారు. విజయవాడలోని వరద బాధితులను ఆదుకోవడానికి మదనపల్లెలో బియ్యం, నిత్యావసర సరకులు, దుప్పట్లు, గ్యాస్‌పొయ్యిలు సేకరించారు. సుమారు 5 వేల మంది బాధితులకు సరిపడా నిత్యావసర సరకులను పంపించారు. రెండు లారీల్లో రూ.50 లక్షల విలువైన నిత్యావసర సరకులతోపాటు 500 గ్యాస్‌పొయ్యిలు తరలించారు. వరదబాధితుల సహాయార్థం ఎమ్మెల్యే రూ.5 లక్షలు విరాళంగా ఇస్తానన్నారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా. స్వయం సహాయ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే ద్వారా రూ.2.70 లక్షలు.. అంతేకాదు మదనపల్లె టమాట మార్కెట్‌లోని కమీషన్ మండీ యజమానులు లారీ టమాటాలు.. టీటీడీ బీసీ విభాగం నేత నాగయ్య 4 టన్నులు టమాటాలను వరద బాధితులకు విరాళంగా అందజేశారు.

