భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నూమూశారు. శ్వాసకోశ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్ట్ 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్సం పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. చివరికి ఆయన పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 12 గురువారం తుది శ్వాస విడిచారు.
తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సీతారాం ఏచూరి ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయన 23 రోజులుగా చికిత్స పొందుతున్నారు. 72 ఏళ్ల ఏచూరి సీపీఎం నేతకు ఇటీవల క్యాటరాక్ట్ ఆపరేషన్ కూడా జరిగింది. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ గౌరి నేతృత్వంలో వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. అయితే ఇన్‌ఫెక్షన్ తొలగించేందుకు ఉపయోగించిన మందులు పనిచేయకపోవడంతో జపాన్ నుంచి ప్రత్యేక మందులు కూడా తెప్పించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.