నేనింతే.. నేనిలాగే ఉంటాను అంటే.. అన్ని సార్లూ కుదురుతుందా? నచ్చిన దారుల్లో వెళ్లాలనుకోవడంలో తప్పు లేదు. కానీ వెలుగు ఇంకో చోట ఉందని తెలిసినా… ఇటే అడుగులు వేస్తానంటే ఏమనుకోవాలి..
నమ్మినదానికోసం పాటుపడితే ఎప్పటికైనా స్పెషల్ గుర్తింపు వస్తుందనుకోవాలా? సంతృప్తిని మించిన సంపద ఏముంటుందనుకోవాలా? ఏమో.. ఇలాంటి పెద్ద పెద్ద విషయాలకు కీర్తీ సురేష్‌లాగా థింక్ డిఫరెంట్ మైండ్‌సెట్ ఉన్నవాళ్లే ఆన్సర్స్ చెప్పగలరేమో.!
ఫస్ట్ నుంచీ తనకంటూ ఏదో ప్రత్యేకత ఉండేలాగా రోల్స్ పిక్ చేసుకుంటున్నారు కీర్తీ సురేష్. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న కేరక్టర్లు… ముందు కీర్తీ సురేష్ తలుపులు తట్టాకే మిగిలిన వాళ్లను పలకరిస్తాయని ఇండస్ట్రీలో ఓ మాట ఉంది.
అంతగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ఈ బ్యూటీ. అయితే ఎప్పుడూ అండర్ ప్లే చేసే రోల్స్ సెలక్ట్ చేసుకోవడం వల్ల మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ మూవీస్‌కి దూరమవుతున్నారా? అనే అనుమానాలకు కూడా చోటిస్తున్నారు ఈ నాయిక.
మహానటిలాంటి సినిమా వచ్చిన తర్వాత, ఈ భామకు పవన్ కల్యాణ్, మహేష్‌తో మూవీస్ వచ్చాయి. అయితే వాటిని సస్టయిన్ చేయడంలో ఎక్కడో తడబడ్డారనే మాట వినిపిస్తోంది.
చెల్లెలి కేరక్టర్లు, వితౌట్ మేకప్ కేరక్టర్లు చేయడం వల్ల.. కీర్తీ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మూవీస్‌కి దూరమయ్యారనే మాటా లేకపోలేదు. ఎక్స్ పెరిమెంట్స్ ని పక్కనపెట్టి, పక్కా కమర్షియల్ లైన్‌ని పట్టుకుని ఉంటే,
ఈ పాటికి ప్యాన్ ఇండియా రేంజ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో కీర్తీ పేరు టాప్‌లో కనిపించేదని అంటున్నారు క్రిటిక్స్. రీసెంట్‌గా బాలీవుడ్ ఎంట్రీ కోసం గ్లామర్ డోస్ పెంచిన ఈ బ్యూటీ, నియర్ ఫ్యూచర్‌లో సినిమాల సెలక్షన్‌లోనూ కొత్తగా ఆలోచిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ..