మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ‘దేవర’ చిత్రం భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మూవీ టీమ్. సెప్టెంబర్ 27న సినిమా ప్రపంచ వ్యక్తంగా విడుదల కానుంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మిగిలి ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అయితే సెన్సార్ బోర్డ్ దేవర సినిమాలో మూడు సీన్స్ కట్ చేయాలని సూచించిందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : రోజాతో ఉన్న ఈ పాప ఇప్పుడు.. సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న భామ.. ఎవరో తెలుసా.?
‘దేవర’కు యూ/ఎ సర్టిఫికెట్ లభించింది. సినిమాకు మూడు సీన్లు కట్ చేసి ఒక సీన్‌లో వీఎఫ్‌ఎక్స్ సీన్‌గా పేర్కొనాలని సెన్సార్ బోర్టు మూవీ టీమ్ కు సూచించారు. మూడు సన్నివేశాల్లో హింస ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే షార్క్ సన్నివేశంలో అది గ్రాఫిక్స్ షార్క్ గా సూచించాలని తెలిపింది సెన్సార్ బోర్డు. దీనికి టీమ్ అంగీకరించినట్లు సమాచారం. అలాగే సినిమాలో ఓ వ్యక్తి తన భార్యను తన్నడం, కత్తితో వ్యక్తి శరీరాన్ని ముక్కలు చేయడం, తల్లిని ఓ చిన్నారిని తన్నడం వంటి సన్నివేశాలపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సన్నివేశాలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సెన్సార్ బోర్డ్ భావించింది. దాంతో ఆ సీన్స్ ను కట్ చేయాలని మూవీ టీమ్ కు సూచించింది సెన్సార్ బోర్డు.
ఇది కూడా చదవండి :Sai Pallavi: ఇదికదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! ముచ్చటగా మూడోసారి ఆ హీరోతో సాయి పల్లవి..
‘దేవర’ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతోంది. ఈ సినిమా మొదటి భాగం రన్‌టైమ్ 177 నిమిషాల 58 సెకన్లు. అంటే సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉంటుందన్నమాట. ఈ సినిమా ట్రైలర్ చూసిన అభిమానుల్లో సినిమా పై అంచనాలు భారీ పెరిగిపోయాయి. ‘దేవర’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. అదేవిధంగా ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న దేవర సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
The hype is real! 🔥🔥😎#DevaraUK crossed 10K+ premiere tickets only at @cinewold 💥
More locations will be added soon🤗
Grand UK 🇬🇧 Premieres on Sep 26th.
Release by @teamdreamze @hamsinient pic.twitter.com/4TvXrhu2xn
— Vamsi Kaka (@vamsikaka) September 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.