BUS Accident in Chittoor: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలి ఘాట్ దగ్గర ఓ బస్సు రెండు లారీలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 మంది వరకూ చనిపోయినట్లు తెలుస్తోంది. 30 మంది వరకూ గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘాట్ రోడ్డులో ప్రమాదం జరగటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.
మరోవైపు బస్సు పలమనేరు నుంచి చిత్తూరు వైపునకు వస్తుండగా పలమనేరు నియోజకవర్గంలోని మొగిలి ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చిత్తూరు బెంగళూరు ప్రధాన రహదారిపై వస్తూ అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ఐరన్ లోడ్‌తో వస్తున్న లారీని ఢీకొట్టింది. ఆ తర్వాత రెండు వాహనాలు మరో టెంపోపైకి దూసుకెళ్లటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు సమాచారం. లారీలోని ఇనుప చువ్వల కింద ఇరుక్కుని కొంతమంది చనిపోయినట్లు తెలిసింది.

అయితే ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. వెంటనే అక్కడకు చేరుకున్నారు. బాధితులను అంబులెన్సులలో సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బాధితుల ఆక్రందనలతో ఆస్పత్రి ప్రాంగణం వద్ద ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. మరోవైపు చిత్తూరు రోడ్డు ప్రమాదం గురించి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. అలాగే ఆస్పత్రి వర్గాలకు ఫోన్ చేసి గాయపడినవారికి అందుతున్న సాయంపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.