Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అబుదాబి వేదికగా భారత్‌కు బిగ్ డీల్స్: రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు !! | pm Modi UAE Visit details that Strengthens Strategic And Economic Ties also 5 billion investments

15 May 2026

LSG vs CSK IPL 2026 Result: ఏడు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విన్..

15 May 2026

Parenting Tips: పిల్లల భవిష్యత్తును మార్చే తండ్రుల సూపర్ హ్యాబిట్స్.. ఇవి మీలో ఉన్నాయా?

15 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ys Jagan Fans Campaign Nara Lokesh,సాయం కోరిన వైసీపీ కార్యకర్తకు మంత్రి లోకేష్ అండ.. అసలు బాలయ్య, బసవతారకం ఆస్పత్రి టాపిక్ ఏంటి! – minister nara lokesh respond on ysrcp follower requests support in getting assistance from cmrf
ఆంధ్రప్రదేశ్

Ys Jagan Fans Campaign Nara Lokesh,సాయం కోరిన వైసీపీ కార్యకర్తకు మంత్రి లోకేష్ అండ.. అసలు బాలయ్య, బసవతారకం ఆస్పత్రి టాపిక్ ఏంటి! – minister nara lokesh respond on ysrcp follower requests support in getting assistance from cmrf

.By .13 September 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ys Jagan Fans Campaign Nara Lokesh,సాయం కోరిన వైసీపీ కార్యకర్తకు మంత్రి లోకేష్ అండ.. అసలు బాలయ్య, బసవతారకం ఆస్పత్రి టాపిక్ ఏంటి! – minister nara lokesh respond on ysrcp follower requests support in getting assistance from cmrf
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Ysrcp Follower Ask Nara Lokesh Help In Twitter: మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఒక వైఎస్సార్‌సీపీ కార్యకర్త సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం ట్వీట్ చేయగా, లోకేష్ వెంటనే స్పందించి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై తెలుగుదేశం కార్యకర్తలు లోకేష్‌ను ప్రశంసించారు. అయితే, వైఎస్సార్‌సీపీ నేత నాగార్జున యాదవ్ గతంలో చంద్రబాబు చెల్లించని బసవతారకం హాస్పిటల్ బిల్లులను జగన్ చెల్లించారని గుర్తు చేశారు. రాజకీయాలకతీతంగా సహాయం చేయడం మంచి విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

హైలైట్:

  • సాయం కోరిన వైసీపీ కార్యకర్త
  • అండా నిలిచిన మంత్రి లోకేష్
  • బసవతారకం టాపిక్ ఎందుకు
Ysrcp Follower Ask Nara Lokesh Help
వైసీపీ కార్యకర్తకు లోకేష్ అండ(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. నెటిజన్లు, ప్రజల నుంచి వచ్చిన రిక్వెస్ట్‌లపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించి అవసరమైన సాయం అందిస్తుంటారు. ఇలా సాయం కోరిన వారికి అవసరమైన గైడెన్స్ ఇచ్చేందుకు ఒక టీమ్‌ను కూడా నియమించారు. ఈ టీమ్ ఎప్పటికప్పుడు సమస్యలకు పరిష్కారం చూపుతోంది. సాయం పొందిన వారిలో సాధారణ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. అయితే ఆసక్తికరంగా ఓ వైఎస్సార్‌సీపీ కార్యకర్త కూడా నారా లోకేష్‌ను సాయం కోరారు.. వెంటనే మంత్రి కూడా స్పందించి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ‘నారా లోకేష్ గారికి ఒక రిక్వెస్ట్.. సీఎంఆర్‌ఎఫ్ విషయంలో మీ సపోర్ట్ కావాలి. మా దగ్గర అవసరమైన అన్ని మెడికల్ బిల్లులు ఉన్నాయి.. వాటిని సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి మాకు అవసరమైన సాయాన్ని సమాయానికి చేయండి.. ప్లీజ్ అవసరమైన సాయం అందించండి’ అంటూ YS Jagan Fans Campaign పేరుతో ఉన్న ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌పై మంత్రి నారా లోకేష్ కూడా వెంటనే స్పందించారు.. ‘మీరు నన్ను సంప్రదించినందుకు ధన్యవాదాలు. సీఎంఆర్‌ఎఫ్ నుంచి మీ రిక్వెస్ట్‌ను నోట్ చేసుకున్నాను. నా టీమ్ వెంటనే ఈ అంశాన్ని పరిశీలిస్తుంది.. మిమ్మల్ని సంప్రదిస్తుంది.. అవసరమైన వివరాలు అందించండి’ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.. తన టీమ్‌ను కూడా అలర్ట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన తెలుగు తమ్ముళ్లు పార్టీలకు అతీతంగా నారా లోకేష్ స్పందిస్తున్నారని స్పందిస్తున్నారు.

నేపాల్ ఘర్షణలు.. చిక్కుకుపోయిన 240 మంది తెలుగువారు.. కాపాడతామన్న మంత్రి నారా లోకేష్

అయితే నారా లోకేష్ ట్వీట్‌పై తెలుగు తమ్ముళ్ల కామెంట్స్‌కు వైఎస్సార్‌సీపీ నేత నాగార్జున యాదవ్ స్పందించారు. ‘ఈ ట్వీట్ చూపించి ఎలేవేషన్ వేసుకునే వాళ్ళకి తెలియదేమో.. నందమూరి బాలకృష్ణ గారు నడిపే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బిల్స్ రూ.4 కోట్లు చంద్రబాబు గారు చెల్లించకపోతే వైయస్ జగన్ గారు వచ్చాక మానవత దృక్పధంతో చెల్లించారని. అధికారం వచ్చిందని ఆదుకున్నవాళ్ళని మర్చిపోతే ఎలా? నారా లోకేష్ గారు’ అంటూ నాగార్జున యాదవ్ టార్గెట్ చేశారు. రాజకీయాల సంగతి పక్కన పెడితే.. అవసరమైనవారికి సాయం చేయడం మంచి విషయమే కదా అంటూ చర్చించుకుంటున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి