డెల్ 15 థిన్ అండ్ లైట్.. అత్యుత్తమ పనితీరును అందించే ల్యాప్ టాప్ లలో డెల్ డెల్ 15 థిన్ అండ్ లైట్ ఒకటి. దీనిలో 12 జెన్ ఇంటెల్ కోర్ ఐత్రీ ప్రాసెసర్, 15.6 డిస్ప్లే అమర్చారు. విండోస్ 11పై పనిచేస్తుంది. అదనపు సౌలభ్యం కోసం స్పిల్-రెసిస్టెంట్ కీబోర్డ్ అందిస్తున్నారు. 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ తో ఫైల్స్ ను నిల్వ చేసుకోవచ్చు. డెల్ ల్యాప్‌టాప్ ధర: రూ. 35,990.
హెచ్ పీ ల్యాప్‌టాప్ 15ఎస్..హెచ్ పీ ల్యాప్‌టాప్ లోని మెరుగైన బ్యాటరీతో చార్జింగ్ సమస్యలు లేకుండా పనిచేసుకోవచ్చు. దీనిలో 4 కోర్ ఏఎండీ రైజెన్ 3 5300యూ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, హై-స్పీడ్ 512 జీబీ ఎస్ఎస్డీ ఏర్పాటు చేశారు. 15.6 అంగుళాల మైక్రో ఎడ్జ్ డిస్‌ప్లే తో టాప్ క్లాస్ విజువల్స్‌ను చూడవచ్చు. అలాగే వైఫై 5, బ్లూటూత్ 4.2, బహుళ పోర్ట్‌లతో కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. 41 డబ్ల్యూహెచ్ బ్యాటరీ తో ఫాస్ట్ ఛార్జింగ్ అవకాశం ఉంది. ఈ ల్యాప్ టాప్ ధర రూ.38,011.
ఏసర్ ఆస్పైర్ లైట్.. 13 జెనరేషన్ ఇంటెల్ కోర్ ఐత్రీ ప్రాసెసర్, 15.6 ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, స్లిమ్ డిజైన్ తదితర ప్రత్యేకతలతో ఏసర్ ఆస్పైర్ లైట్ అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ, బహుళ పోర్ట్‌లు ఏర్పాటు చేశారు. పర్సనల్, ఆఫీసు పనులు చేసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఏసర్ ల్యాప్‌టాప్ రూ.33,990కు అమెజాన్ లో అందుబాటులో ఉంది.
లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్.. వేగవంతమైన పనితీరు, తొమ్మిది గంటలు పనిచేసే బ్యాటరీ దీని ప్రత్యేకతలు. ఏఎండీ రైజెన్ 5 5500యూ ప్రాసెసర్‌తో పనితీరు పరుగులు పెడుతుంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ, 15.6 ఎఫ్ హెచ్ డీ డిస్‌ప్లే, మంచి డిజైన్, యాంటీ గ్లేర్ టెక్నాలజీతో ఆకట్టుకుంటోంది. 1.61 కేజీల బరువున్న ఈ ల్యాప్ టాప్ ను ఎక్కడికైనా చాలా సులువుగా తీసుకువెళ్లవచ్చు. దీని ధర రూ.39,990.
హెచ్ పీ ల్యాప్ టాప్ 15.. 15.6 అంగుళాల ఎఫ్ హెచ్ డీ మైక్రో ఎడ్జ్ డిస్‌ప్లే, 250 నిట్ బ్రైట్‌నెస్, యాంటీ-గ్లేర్ టెక్నాలజీ తో స్క్రీన్ చాలా స్పష్టంగా ఉంటుంది. 4 కోర్ ఏఎండీ రైజెన్ 3 5300యూ ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీనిలోని 41 డబ్ల్యూహెచ్ బ్యాటరీతో పనితీరు వేగంగా, సౌకర్యంగా ఉంటుంది. అమెజాన్ లో హెచ్ పీ ల్యాప్ టాప్ 15ఎస్ ల్యాప్‌టాప్ రూ.32,490కు అందుబాటులో ఉంది.