Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Mrigasira Karte: మృగశిర కార్తె వచ్చేసింది.. తొలకరి జల్లులు, చేపల సంప్రదాయం వెనుక ఉన్న రహస్యమేమిటి?

7 June 2026

గోవా వద్దు.. అదే ముద్దు..? జర్నీ, టూరిజంలోనూ వాటికే ప్రయారిటీ అంటున్న GenZ

7 June 2026

జిమ్‌కు వెళ్లే టైమ్‌ లేదా? స్మార్ట్‌ బాడీ అంటే ఇష్టమా? ఇలా చేస్తే అది మీ సొంతం

7 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»తలసరి ఆదాయం ప్రకారం ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 2.. మరి ఏపీ పరిస్థితి ఏంటి?
తెలంగాణ

తలసరి ఆదాయం ప్రకారం ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 2.. మరి ఏపీ పరిస్థితి ఏంటి?

.By .18 September 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
తలసరి ఆదాయం ప్రకారం ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 2.. మరి ఏపీ పరిస్థితి ఏంటి?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


పట్టుమని పదేళ్లు కూడా లేని రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రాల్లో 2వ స్థానంలో నిలిచింది. పూర్తిగా పట్టణ రాష్ట్రమైన ఢిల్లీ తర్వాత స్థానంలో తెలంగాణ నిలిచింది. ధనిక, పేద రాష్ట్రాలన గుర్తించేందుకు జీఎస్డీపీ, తలసరి ఆదాయం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. దేశానికి అత్యధికంగా స్థూల జాతీయోత్పత్తి (GDP) గడించి పెడుతున్న మహారాష్ట్ర, ధనిక రాష్ట్రాల జాబితాలో తొలి 5 స్థానాల్లో నిలవలేకపోయింది. కానీ తొలి 5 స్థానాల్లో తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు చోటు సాధించి దక్షిణ భారతదేశ సామర్థ్యాన్ని చాటాయి. 1991 నాటికి తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే దక్షిణాది రాష్ట్రాల సగటు చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మూడు రాష్ట్రాలు ధనిక రాష్ట్రాలుగా నిలిచాయి. ఆ దశాబ్దం ప్రారంభంలో చేపట్టిన ఆర్థిక సరళీకృత విధానాలను దక్షిణాది రాష్ట్రాలను అందిపుచ్చుకుని శరవేగంగా దూసుకెళ్లాయి. ఫలితంగా ఒకప్పుడు వెనుకబాటుతనంలో మగ్గిపోయిన రాష్ట్రాలు 2-3 దశాబ్దాల్లో అనూహ్య పురోగతి సాధించాయి.

దక్షిణాదిలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలన్నీ తలసరి ఆదాయం ప్రకారం ధనిక రాష్ట్రాలుగా లేకపోవచ్చు. కానీ ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ (PMEAC) ప్రకారం మాత్రం ఈ ఐదు రాష్ట్రాలు ధనిక రాష్ట్రాలే. దేశ జీడీపీలో ఈ 5 రాష్ట్రాల వాటా మార్చి, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 30% గా నమోదైంది. దక్షిణాదికి ఆనుకుని ఉన్న మధ్య, పశ్చిమ రాష్ట్రం మహారాష్ట్ర ఇప్పటికీ అత్యధిక జీడీపీ అందిస్తున్న రాష్ట్రంగా నిలిచినప్పటికీ.. గత దశాబ్దన్నర కాలంగా 15% వాటా కలిగిన ఈ రాష్ట్రం ఇప్పుడు 13.3%కు పరిమితమైంది. దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబై మహానగరమే అత్యధిక జీడీపీకి కారణం. అనేక కార్పొరేట్ సంస్థలు ముంబై కేంద్రంగా తమ వ్యాపార కార్యాకలాపాలు సాగిస్తున్నాయి. అయితే ఎంపీ స్థానాల ప్రకారం 2వ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర, తలసరి ఆదాయం గణాంకాల్లో మాత్రం తొలి 5 స్థానాల్లో నిలవలేకపోయింది.

ధనిక రాష్ట్రాల కొలమానం ఏంటి?

ధనిక రాష్ట్రాల కొలమానంలో జీడీపీ, తలసరి ఆదాయం వంటివి కీలక పారామీటర్స్‌గా చెప్పుకోవచ్చు. ఆ ప్రకారం జాతీయ సగటు కంటే ఏ రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది? అది ఎంత శాతం ఎక్కువగా ఉంది? అనే అంశాలను పరిగణలోకి తీసుకుంటూ జాబితా రూపొందించగా.. 250.18%తో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. 1960-61లో ఈ రాష్ట్రం 218.3% కలిగి ఉండగా, కొన్ని దశాబ్దాల్లో అది మరింత పెరిగింది. ఆ తర్వాతి స్థానంలో 193.6% శాతంతో తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. ఇక్కడ 100% అంటేనే జాతీయ సగటు కంటే రెట్టింపు అని అర్థం. అలాంటి రెండు, రెండున్నర రెట్ల అధిక తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నందుకు ధనిక రాష్ట్రాల జాబితాలో చోటు సంపాదించాయి. ఢిల్లీ, తెలంగాణ తర్వాత కర్ణాటక (180.7%), హర్యానా (176.8%), తమిళనాడు (171.1%)తో మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచాయి. ఇందులో కర్ణాటక 1960-61లో 96.7% అధిక తలసరి ఆదాయం కలిగి ఉండగా.. అదిప్పుడు రెట్టింపు అయింది. అత్యధిక జీడీపీ వాటా కల్గిన మహారాష్ట్ర సైతం 63 ఏళ్ల క్రితం ఉన్న 133.7% నుంచి 150.7% తలసరి ఆదాయాన్ని నమోదు చేసింది.

పేద రాష్ట్రాలు ఇవే…

తలసరి ఆదాయం ప్రకారం పేద రాష్ట్రాల జాబితాలో వరుసగా బిహార్ (32.8%), జార్ఖండ్ (57.2%), ఉత్తర్ ప్రదేశ్ (50.8%), మణిపూర్ (66%), అస్సాం (73.7%) నిలిచాయి. ఇందులో యూపీ, బిహార్ అత్యధిక జనాభ, జనసాంద్రత కల్గిన రాష్ట్రాలు. 1960-61లో జీడీపీలో యూపీ వాటా 14% ఉండగా, అదిప్పుడు 9.5 శాతానికి పడిపోయింది. జనాభా ప్రకారం యూపీ, మహారాష్ట్ర తర్వాతి స్థానంలో ఉన్న బిహార్ జీడీపీలో కేవలం 4.3% వాటా మాత్రమే కలిగి ఉంది.

1960లలో మొదలైన హరిత ఉద్యమం (గ్రీన్ రివల్యూషన్) కారణంగా పంజాబ్ రాష్ట్రం అత్యధికంగా లాభపడింది. ఆ రాష్ట్రంలో జాతీయ సగటు తలసరి ఆదాయంతో పోల్చితే 119.6%గా ఉన్న తలసరి ఆదాయం 1971 నాటికి 169% శాతానికి పెరిగింది. వ్యవసాయం ద్వారా లబ్ది పొందిన ఈ రాష్ట్రం ఇప్పటికీ 106%తో జాతీయ సగటుతో పోల్చితే రెట్టింపు ఆదాయాన్ని కలిగి ఉంది. అటు పంజాబ్‌కు, ఇటు ఢిల్లీకి మధ్యలో ఉన్న హర్యానాలో ఢిల్లీని ఆనుకుని అభివృద్ధి చెందిన గురుగ్రాం కారణంగా తలసరి ఆదాయం గత కొన్ని దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. అందుకే ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల తర్వాత 4వ స్థానం సంపాదించగలిగింది.

ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి?

దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ కూడా ధనిక రాష్ట్రమే అయిప్పటికీ తలసరి ఆదాయం గణాంకాల్లో తొలి 5 స్థానాల్లో చోటు సంపాదించలేకపోయింది. ఇందుకు కారణంగా అత్యధిక ఆదాయం గడించి పెడుతున్న హైదరాబాద్ వంటి మహానగరం లేకపోవడమేనని ఆ రాష్ట్ర పాలకులు చెబుతుంటారు. అయినప్పటికీ జీడీపీలో 9వ స్థానం, తలసరి ఆదాయం గణాంకాల ప్రకారం 16వ స్థానంలో నిలిచింది. 2019 – 2024 మధ్యకాలంలో 888 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించగలిగింది. అయితే పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణ మాత్రం ఈ ఐదేళ్ల కాలంలో ఏకంగా 7.77 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకోగలిగింది.

భారతదేశ తూర్పు ముఖద్వారం (ఈస్టర్న్ గేట్‌వే ఆఫ్ ఇండియా)గా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోనే పొడవైన తీర రేఖ కల్గిన రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉంది. అనేక ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. జీడీపీలో తన వాటా క్రమక్రమంగా పెంచుకుంటూ ముందుకెళ్తోంది. జీడీపీలో ఇప్పటికీ వ్యవసాయమే అత్యధిక వాటా కలిగి ఉన్నప్పటికీ దాంతో పాటు జౌళి, ఫార్మా, ఐటీ రంగాల్లో పెట్టుబడులను ఆకట్టుకుంటూ వేగంగా పురోగతి పథంలో దూసుకెళ్తోంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఇద్దరు మహిళలతో భర్త.. చూసి పూనకంతో ఊగిపోయిన భార్య.. ఆ తర్వాత..!

7 June 2026

TGPSC Notification 2026: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగాలు.. నిరుద్యోగులకు భారీ అవకాశం

7 June 2026

“అమ్మా.. నీ వెంటే నేను వస్తున్నా..” మృతదేహంపై పడి కన్నుమూసిన కూతురు!

7 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Mrigasira Karte: మృగశిర కార్తె వచ్చేసింది.. తొలకరి జల్లులు, చేపల సంప్రదాయం వెనుక ఉన్న రహస్యమేమిటి?

7 June 2026

Mrigasira Karte Begins: రోహిణి కార్తెలో భానుడి ప్రతాపానికి భూమి అగ్నిగుండంలా మారిపోతుంది. రోళ్లు సైతం పగిలిపోయేంత ఎండలు ప్రజలను…

గోవా వద్దు.. అదే ముద్దు..? జర్నీ, టూరిజంలోనూ వాటికే ప్రయారిటీ అంటున్న GenZ

7 June 2026

జిమ్‌కు వెళ్లే టైమ్‌ లేదా? స్మార్ట్‌ బాడీ అంటే ఇష్టమా? ఇలా చేస్తే అది మీ సొంతం

7 June 2026

101 నుంచి 65 కేజీలకు వెయిట్‌..! డైట్ ప్లాన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే మరి

7 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Mrigasira Karte: మృగశిర కార్తె వచ్చేసింది.. తొలకరి జల్లులు, చేపల సంప్రదాయం వెనుక ఉన్న రహస్యమేమిటి?

7 June 2026

గోవా వద్దు.. అదే ముద్దు..? జర్నీ, టూరిజంలోనూ వాటికే ప్రయారిటీ అంటున్న GenZ

7 June 2026

జిమ్‌కు వెళ్లే టైమ్‌ లేదా? స్మార్ట్‌ బాడీ అంటే ఇష్టమా? ఇలా చేస్తే అది మీ సొంతం

7 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025557

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025510

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.