ప్రాథమికంగా కొన్ని అంశాలు తెరపైకి వచ్చాయి.. 18 ఏళ్లు వయసు దాటి ఉండాలని.. 59 సంవత్సరాల వరకు మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి నిధులు జమ చేస్తారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా కొంత భరోసా నింపే దిశగా.. ప్రతి నెలా లబ్ధిదారులకు రూ.1500 చొప్పున డీబీటీ మోడ్ ద్వారా నేరుగా వారి ఖాతాకు డబ్బుల్ని జమ చేస్తారు. మహిళలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందించే అంశంపై కూడా కేబినెట్ చర్చించింది.
అలాగే ఏపీ కేబినెట్‌లో నూతన మద్యం పాలసీకి ఆమోదం తెలపనున్నారు. ఆపరేషన్ బుడమేరు, అమరావతిపై ఐఐటి నివేదికపై చర్చించారు. బీసీ కార్పొరేషన్ల పునర్ వ్యవస్థీకరణ, పారిశ్రామిక అభివృద్ధి, నీరు – చెట్టు పెండింగ్ బిల్లులు, విద్యుత్ సంస్కరణలు, వివిధ మంత్రిత్వ శాఖల నివేదికలపై చర్చ జరిగింది. వరద నష్టం, వరద బాధితులకు సాయం, ఇంటింటికి కుళాయి కనెక్షన్‌లపై చర్చించారు. రాష్ట్రంలో బ్యారేజీల మరమ్మత్తుల కోసం నిధుల కేటాయింపుకు ప్రతిపాదనలపైనా చర్చించారు. వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో మంత్రుల గ్రాఫ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించనున్నారు. జనసేన మంత్రుల గ్రాఫ్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్తారు. అంతేకాదు ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశంకాబోతున్నారు.. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా హాజరవుతారు.