Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Watch Video: భార్య కాపురానికి రావట్లేదని భర్త మాస్టర్ ప్లాన్ .. ఏం చేశాడో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

12 April 2026

ముమ్మాటికీ ఇది దాడే !! నిప్పులు చెరిగిన కమల్ హాసన్

12 April 2026

Hyderabad: బిగ్ అలర్ట్.. సన్‌రైజర్స్ మ్యాచ్‌కు వెళ్తున్నారా..? ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు..

12 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»బాలినేని శ్రీనివాస రెడ్డి,Balineni: వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి గుడ్ బై.. రాజీనామాకు కారణాలివే! – balineni srinivasa reddy quits ysrcp and sent resign letter to ys jagan
ఆంధ్రప్రదేశ్

బాలినేని శ్రీనివాస రెడ్డి,Balineni: వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి గుడ్ బై.. రాజీనామాకు కారణాలివే! – balineni srinivasa reddy quits ysrcp and sent resign letter to ys jagan

.By .18 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
బాలినేని శ్రీనివాస రెడ్డి,Balineni: వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి గుడ్ బై.. రాజీనామాకు కారణాలివే! – balineni srinivasa reddy quits ysrcp and sent resign letter to ys jagan
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. కొద్దిరోజులుగా వైసీపీ అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఆ పార్టీని వీడారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజీనామా లేఖను కూడా పంపించారు. 2014లో వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. తొలి రెండున్నరేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. అయితే మంత్రివర్గ పునర్వస్థీకరణలో అప్పట్లో మంత్రి పదవి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని తప్పించారు. అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.

తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నేతగా పనిచేశారు. అనంతరం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున వరుసగా విజయం సాధించారు. మంత్రిగానూ పనిచేశారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరుఫున మరోసారి ఒంగోలు నుంచి విజయం సాధించారు. అయితే 2014లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన బాలినేని… వైసీపీ తరుఫున క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో ఒంగోలు నుంచి మరోసారి గెలుపొందిన బాలినేని.. వైఎస్ జగన్ మంత్రివర్గంలో రెండున్నరేళ్ల పాటు మంత్రిగా కొనసాగారు.

అయితే మంత్రివర్గ పునర్వవస్థీకరణలో బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించడం అప్పట్లో ఆయనలో అసంతృప్తికి కారణమైంది. ఆ తర్వాత 2024 ఎన్నికల సమయంలోనూ వైసీపీ అధిష్ఠానం నిర్ణయాలతో ఆయన విభేదిస్తూ వచ్చారు. ఒంగోలు ఎంపీ సీటును మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు బాలినేని. అయితే వైఎస్ జగన్ మాత్రం.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో మరోసారి బాలినేని అసంతృప్తికి గురయ్యారు. 2024 ఎన్నికల్లో ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధనరావు చేతిలో ఓడిపోయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై పోరాటం ప్రారంభించిన బాలినేని.. ఒంగోలులో రీకౌంటింగ్‌కు సైతం పట్టుబట్టారు. అయితే ఈ వ్యవహారంలో వైసీపీ అధిష్టానం నుంచి తనకు ఏ మాత్రం మద్దతు లభించలేదని ఇటీవల అసంతృప్తి సైతం వ్యక్తం చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలోనే బాలినేని వైసీపీని వీడతారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. చివరకు ఆ ప్రచారం ప్రకారమే వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పారు. అయితే కొన్ని కారణాలతోనే రాజీనామా చేసినట్లు బాలినేని చెప్పారు. రాజకీయాలు వేరు, కుటంబాలు, బంధుత్వాలు వేరన్న బాలినేని.. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని అన్నారు. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

సొంత అన్నను కడతేర్చిన తమ్ముడు.. అడ్డొచ్చిన కుటుంబసభ్యులపై దాడి..!

12 April 2026

ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్.. ఒక్క పాయింట్ తేడాతో చరిత్ర సృష్టించిన భారత్..!

12 April 2026

Simhachalam Chandanotsavam Tickets Release Date,సింహాచలం చందనోత్సవం: అప్పన్న భక్తులకు అలర్ట్.. నిజరూప దర్సనం టికెట్ల విక్రయాలు.. – simhachalam chandanotsavam 2026 tickets booking starts from april 13th by online and offline

12 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

Watch Video: భార్య కాపురానికి రావట్లేదని భర్త మాస్టర్ ప్లాన్ .. ఏం చేశాడో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

12 April 2026

భార్యను కాపురానికి పంపడం లేదని అత్తను కరెంట్ షాక్‌తో చంపడానికి అల్లుడు ప్రయత్నించిన ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది.…

ముమ్మాటికీ ఇది దాడే !! నిప్పులు చెరిగిన కమల్ హాసన్

12 April 2026

Hyderabad: బిగ్ అలర్ట్.. సన్‌రైజర్స్ మ్యాచ్‌కు వెళ్తున్నారా..? ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు..

12 April 2026

సీఎం రేవంత్‌కు దమ్ముంటే – కేటీఆర్ సంచలన డిమాండ్..!! | BRS working president KTR open Challenge for CM Revanth in machiryal party meeting, here the details

12 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Watch Video: భార్య కాపురానికి రావట్లేదని భర్త మాస్టర్ ప్లాన్ .. ఏం చేశాడో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

12 April 2026

ముమ్మాటికీ ఇది దాడే !! నిప్పులు చెరిగిన కమల్ హాసన్

12 April 2026

Hyderabad: బిగ్ అలర్ట్.. సన్‌రైజర్స్ మ్యాచ్‌కు వెళ్తున్నారా..? ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు..

12 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025494

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025443

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.