సీఎం చంద్రబాబు సంచలనం కామెంట్స్ చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని.. గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని వ్యాఖ్యానించారు. నాసిరకమైన సరుకులు వాడడమే కాకుండా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ (జంతు నూనె) కూడా వాడారని తెలిసిందన్నారు. ఈ విషయం తెలిసి.. ఆందోళన చెందినట్లు చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి.. లడ్డూ ప్రసాదం కోసం వాడుతున్నట్లు చెప్పారు.
వరదల నేపథ్యంలో 350 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందని.. ఇదొక చరిత్ర అన్నారు చంద్రబాబు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఒప్పుకుంటే.. ఎన్డీఏ ఎమ్మెల్యేలు అందరం ఒక నెల జీతం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇద్దామని కోరారు సీఎం చంద్రబాబు. ప్రపంచం అంతా స్పందించిదని.. మనం కూడా కూడా స్పందిస్తే హుందాగా ఉంటుందన్నారు సీఎం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.