మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇప్పట్లో షూటింగ్‌కు రానట్లే..! చిరంజీవి కూడా చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకున్నారు.. ఇక రవితేజ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. నాని అప్పుడే ఇంకో సినిమాతో బిజీ అయిపోయారు. ప్రభాస్ కూడా కొత్త సినిమాను మొదలు పెట్టారు. ఇలా ముక్కలు ముక్కలుగా కాకుండా ఫుల్ షూటింగ్ అప్‌డేట్స్ ఒకేసారి చూసొద్దాం పదండి..
ప్రభాస్ ఇటు మారుతి.. అటు హను రాఘవపూడి సినిమాలని కవర్ చేస్తున్నారు. రాజా సాబ్ చివరి దశకు వచ్చేయడంతో.. హను సినిమాను కారైకూడిలో మొదలుపెట్టారు. ఫస్ట్ షెడ్యూల్‌లో ప్రభాస్ కూడా జాయిన్ అయ్యారు. ఇక నాగార్జున, ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న కుబేరా షూటింగ్ రెండు వారాలుగా సికింద్రాబాద్‌లోనే జరుగుతుంది.
వరుణ్ తేజ్, కరుణ కుమార్ కాంబోలో వస్తున్న మట్కా షూట్ RFC నుంచి కాకినాడకు షిఫ్ట్ అయింది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ కేరళలో జరుగుతుంది.
సాయి ధరమ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. సిద్ధూ జొన్నలగడ్డ జాక్ షూట్ నేపాల్‌లో జరుగుతుంది.
బాబీ, బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న NBK 109 షూటింగ్ చౌటుప్పల్‌లో జరుగుతుంది. ఇక నాని హిట్ 3 షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతుంది. రజినీ సైతం ఇక్కడే ఉన్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈయన నటిస్తున్న కూలీ షూటింగ్ వైజాగ్ పోర్ట్‌లో జరుగుతుంది. మిగిలిన వాళ్లంతా రెస్ట్ మోడ్‌లో ఉన్నారు.