అయితే ఈ సారి పండగను ఏ రోజున జరుపుకోవాలి? పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. దీపావళి అంటే రాత్రి సమయంలో జరుపుకునే పండుగ, ముఖ్యంగా ఈ సమయంలో లక్ష్మీ పూజను సాయంత్రం సూర్యస్తమయం తర్వాత ప్రదోష కాలంలో నిర్వహిస్తారు. అయితే ఈ సారి అమావాస్య తిథి అనేది అక్టోబర్ 20 న ప్రారంభమం అవుతుంది, ఆ రోజే ప్రదోష కాలం నిశిత కాలంలో కలుస్తుంది కాబట్టి, శాస్త్రాల ప్రకారం సోమవారం రోజునే దీపావళి పండుగను జరుపుకోవాలంట.

