
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోరా హోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే ఆరో వారం ఎండింగ్ కు వచ్చేసింది. కంటెస్టెంట్స్ ఎవరికి వారు తమ గేమ్ స్ట్రాటజీని పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంటరైన తర్వాత హౌస్ లో మజా పెరిగింది. పాత హౌస్ మేట్స్, కొత్త కంటెస్టెంట్స్ కలయికతో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నిజంగానే రణరంగంలా మారింది. ఇక ఆ ఆదివారం (అక్టోబర్ 19) నాటి ఎపిసోడ్ లో మరొకరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. ఆ కంటెస్టెంట్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మాజీ కంటెస్టెంట్స్ చాలా మంది బిగ్ బాస్ షోపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కంటెస్టెంట్ల గురించి తమ రివ్యూలు ఇస్తున్నారు. అయితే మాజీ కంటెస్టెంట్ ఒకరు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకటి కాదు రెండు సార్లు బిగ్ బాస్ తెలుగు హౌస్ లో సందడి చేసిన ఆమె ఇప్పుడు జీవితంలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి కామెంట్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? అఆ సినిమాతో ఓ రేంజ్ లో ఫేమస్ అయిన నటి, యాంకర్ హరి తేజ.
పలు సినిమాలు, సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ రెండు సార్లు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది. బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొన్న హరితేజ గతేడాది బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చింది. విజేతగా నిలవకపోయినా మంచి కంటెస్టెంట్ గానే పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘ బిగ్ బాస్ మొదటి సీజన్ హైదరాబాద్ లో జరగలేదు. ముంబై సమీపంలో ఉన్న లోనావాలాలో జరిగింది. అడవిలో బిగ్ బాస్ సెట్ వేశారు. రాత్రి అయితే పులుల శబ్దాలు వినిపించేవి. హౌస్ లోకి పాములు కూడా వచ్చేవి. కానీ నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. అయితే ఇప్పుడు బిగ్ బాస్ చూడట్లేదు. రెండు సార్లు వెళ్లిన తర్వాత ఆ రియాలిటీ షోపై ఇంట్రెస్ట్ పోయింది. చిరాకు కూడా వచ్చేసింది.
హరి తేజ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
‘ సీజన్ 8 తర్వాత నా ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. చాలా మంది నా మీద ద్వేషం చూపించారు. నేను ఆత్మన్యూనతా భావానికి లోనయ్యాను. డిప్రెషన్ బారిన పడ్డాను. కోలుకోవడానికి చాలా టైమ్ పట్టింది. ఈ కారణంగానే ఇంకోసారి బిగ్ బాస్ షోకు వెళ్లదల్చుకోలేదు’ అని హరి తేజ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

makeup artist (@emraanartistry)