Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Actress : నన్ను నేను కోల్పోయాను.. అతడి మరణం నన్ను పూర్తిగా మార్చేసింది.. బిగ్ బాస్ బ్యూటీ..

12 November 2025

Singer Chinmayi: ‘జానీ మాస్టర్ భార్య నాకు ఫోన్ చేసి’.. సింగర్ చిన్మయి సంచలన ఆరోపణలు

12 November 2025

RCB Home Ground: ఆర్‌సీబీ అడ్డాగా వైజాగ్ స్టేడియం.. మారిన బెంగళూరు హోమ్ గ్రౌండ్‌..?

12 November 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Drought Mandals List,ఏపీలోని ఈ జిల్లాల్లో కరవు ఉంది.. లిస్ట్ ఇదే, మీ మండలం పేరు ఉందేమో చూస్కోండి – andhra pradesh government released disstrict wise drought mandals list
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Drought Mandals List,ఏపీలోని ఈ జిల్లాల్లో కరవు ఉంది.. లిస్ట్ ఇదే, మీ మండలం పేరు ఉందేమో చూస్కోండి – andhra pradesh government released disstrict wise drought mandals list

.By .1 November 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Drought Mandals List,ఏపీలోని ఈ జిల్లాల్లో కరవు ఉంది.. లిస్ట్ ఇదే, మీ మండలం పేరు ఉందేమో చూస్కోండి – andhra pradesh government released disstrict wise drought mandals list
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Drought Mandals List Released: ఆంధ్రప్రదేశ్‌లో కరవు మండలాలపై స్పష్టత వచ్చింది. మూడు జిల్లాల్లో కరవు మండలాలు ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో 25, అన్నమయ్యలో 9, ప్రకాశంలో 3 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. దీంతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరుతున్నారు. మరోవైపు, ఏపీ టిడ్కోకు రూ.540 కోట్ల నిధులు విడుదలయ్యాయి. మైనారిటీలకు ఉచిత టెట్ కోచింగ్ కూడా ప్రారంభం కానుంది.

హైలైట్:

  • ఏపీలో కరవు మండలాల జాబితా విడుదల
  • మూడు జిల్లాల్లో కరవు మండలాలు ఉన్నాయి
  • సత్యసాయి 25, అన్నమయ్య 9, ప్రకాశం 3
AP Drought Mandals
ఏపీలో 3 జిల్లాల్లోని 37 మండలాల్లో కరవు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్‌లో కరవు మండలాలపై క్లారిటీ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు జిల్లాల్లోని 37 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. శ్రీసత్యసాయి జిల్లాలో 25 మండలాలు కరవు బారిన పడగా, వీటిలో 12 తీవ్ర కరవు, 13 మధ్యస్థ కరవు ప్రాంతాలుగా గుర్తించారు. అన్నమయ్య జిల్లాలో 9, ప్రకాశం జిల్లాలో 3 మండలాలను మధ్యస్థ కరవు మండలాలుగా ప్రకటించారు. శ్రీసత్యసాయి జిల్లాలో హిందూపురం, మడకశిర, ముదిగుబ్బ, అగలి, ఆమడగూరు, రామగిరి, గాండ్లపెంట, ఎన్‌పీకుంట, ఓడీ చెరువు, రోళ్ల, తలుపుల, తనకల్‌ మండలాల్లో తీవ్ర కరవు ఉంది. అలాగే బత్తపల్లి, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, కనగానిపల్లి, కొత్తచెరువు, లేపాక్షి, అమరాపురం, బుక్కపట్నం, గుదిబండ, నల్లచెరువు, నల్లమడ, సోమందేపల్లి మండలాల్లో మధ్యస్థ కరవు పరిస్థితులున్నాయి.అన్నమయ్య జిల్లాలో కురబలకోట, మదనపల్లె, నిమ్మనపల్లె, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, వీరబల్లె, రామసముద్రం, వాల్మీకిపురం మండలాల్లో మధ్యస్థ కరవుగా ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో కొండపి, పొన్నలూరు, జరుగుమల్లి మండలాల్లో మధ్యస్థ కరవు పరిస్థితులున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ కరవు పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు అండగా నిలవాలని కోరుతున్నారు. గతంతో పోలిస్తే కొన్ని జిల్లాల్లో కరువు పరిస్థితులు కాస్త మెరుగయ్యాయని చెప్పొచ్చు.

ఏపీ ప్రభుత్వం అప్డేట్స్

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టిడ్కో)కు నిధులు విడుదలయ్యాయి. ఈ మే రకు రూ.540 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. హడ్కో నుంచి తీసుకున్న రుణం చెల్లించేందుకు ఈ మొత్తాన్ని మంజూరు చేసింది. ఈ నిధులకు సంబంధించి పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మైనారిటీ అభ్యర్థులకు ఉచితంగా టెట్ పరీక్ష కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రకటించారు. నవంబర్ మొదటి వారం నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభమవుతాయి. ఆసక్తి గలవారు సీఈడీఎం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మైనారిటీల విద్యాభివృద్ధి కోసం పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ మైనారిటీస్‌ (సీఈడీఎం) ఈ కోచింగ్ అందిస్తోంది. టెట్ పరీక్ష రాయాలనుకునే మైనారిటీ అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. విద్యార్థులు తమ సౌలభ్యాన్ని బట్టి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతిలో కోచింగ్ తీసుకోవచ్చు. కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు సీఈడీఎం అధికారిక వెబ్‌సైట్ www.apcedmmwd.org ను సందర్శించాలి. అక్కడ దరఖాస్తు ఫారమ్ నింపి సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా టెట్ కోసం సిద్ధమవుతున్న అర్హులైన అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి