Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Safety Pin: ఓర్ని ఇదేందిరా సామీ.. ఈ సేఫ్టీ పిన్ ఇంత కాస్టా.. కొనాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే!

7 November 2025

డ్రాగన్‌ తారక్‌.. లుక్‌ అదిరింది నీల్‌

7 November 2025

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం వరిస్తుంది.. పెళ్ళి తర్వాత లైఫ్‌స్టైల్‌ మారిపోతుందట!

7 November 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Govt Rtgs Centers In 13 Districts,ఏపీలో 13 జిల్లాలకు మహర్దశ.. కొత్తగా ఆర్టీజీఎస్ సెంటర్లు, డిసెంబర్‌నాటికి పూర్తి – andhra pradesh government plans to establish rtgs centers in 13 districts
ఆంధ్రప్రదేశ్

Ap Govt Rtgs Centers In 13 Districts,ఏపీలో 13 జిల్లాలకు మహర్దశ.. కొత్తగా ఆర్టీజీఎస్ సెంటర్లు, డిసెంబర్‌నాటికి పూర్తి – andhra pradesh government plans to establish rtgs centers in 13 districts

.By .1 November 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Govt Rtgs Centers In 13 Districts,ఏపీలో 13 జిల్లాలకు మహర్దశ.. కొత్తగా ఆర్టీజీఎస్ సెంటర్లు, డిసెంబర్‌నాటికి పూర్తి – andhra pradesh government plans to establish rtgs centers in 13 districts
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh 13 Districts Rtgs Centers: మొంథా తుఫాన్ అనుభవం తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) సాంకేతికతను మరింత బలోపేతం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తూ, విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి, ప్రాణనష్టాన్ని నివారించడానికి ఈ వ్యవస్థను కీలకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆధునిక సాంకేతికతతో పాలనను మెరుగుపరచడమే దీని ఉద్దేశ్యం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

  • ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
  • 13 జిల్లాల్లో ఆర్టీజీఎస్ సెంటర్లు ఏర్పాటు
  • ఈ డిసెంబర్‌కు పూర్తి చేయాలని నిర్ణయం
AP Rtgs Centers
ఏపీలో కొత్తగా 13 ఆర్టీజీఎస్ సెంటర్లు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌ను మొంథా తుఫాన్ వణికించింది.. మూడు రోజుల పాటూ కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ప్రజలను అప్రమత్తం చేయడంలో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) సాంకేతికత కీలక పాత్ర పోషించింది. ఈ సాంకేతికత సహాయంతో భారీ విపత్తులోనూ ప్రాణనష్టం నివారించడం సాధ్యమైంది. ఈ అనుభవం దృష్ట్యా, రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఆర్టీజీఎస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రంలో 13 ఆర్టీజీఎస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రాలను రాజధానిలోని ప్రధాన కేంద్రంతో అనుసంధానం చేస్తారు. ఈ ఆర్టీజీఎస్ కేంద్రాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి, అన్ని ప్రభుత్వ విభాగాల సమాచారాన్ని అక్కడి ఆర్టీజీఎస్‌ కేంద్రాలకు అనుసంధానం చేస్తారు. జిల్లాల్లో నిర్మించే ఈ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తారు. విపత్తుల సమయంలో ఈ కేంద్రాలు కీలకంగా మారతాయని బావిస్తున్నారు. రాష్ట్ర ఆర్టీజీఎస్‌ కేంద్రాన్ని సరికొత్త హంగులతో తీర్చిదిద్దాలని నిర్ణయించుకుంది. సచివాలయం సమీపంలో ఒక మల్టీపర్పస్‌ భవనాన్ని నిర్మిస్తోంది. ఈ కేంద్రం ద్వారా అందించే ఆర్టీజీఎస్‌ సేవలను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే, వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా ప్రజలకు 750 రకాల సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇస్రో సంస్థ సహకారంతో ‘అవేర్‌ 2.0’ అనే కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీని ద్వారా శాటిలైట్‌ల సహాయంతో వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఒకేచోట భద్రపరిచేందుకు ‘డేటా లేక్‌’ అనే వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ ఆధునిక కార్యకలాపాలన్నింటికీ, కొత్తగా నిర్మిస్తున్న ఆర్టీజీఎస్‌ కేంద్రమే ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.

రాష్ట్రస్థాయి ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను. 13 జిల్లాల్లోనూ ఈ ప్రాజెక్టులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అనేది ఒక పెద్ద కంట్రోల్ రూమ్ లాంటిది. ఇక్కడ నుంచి రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన పనులను పర్యవేక్షిస్తారు. దీనిలో భాగంగానే 264 మంది కూర్చుని పనిచేయడానికి వీలుగా టేబుళ్లు సిద్ధం చేస్తున్నారు. పెద్ద మీటింగ్‌లు పెట్టుకోవడానికి 338 మంది కూర్చునేలా ఒక పెద్ద హాల్‌ను, చిన్న మీటింగ్‌ల కోసం 14 మందితో సమావేశం అయ్యేలా ఒక మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ను కూడా నిర్మిస్తున్నారు.

ముఖ్యమంత్రి కార్యాలయం, ఆర్టీజీఎస్‌ డైరెక్టర్‌ కార్యాలయాలు కూడా ఈ సెంటర్‌లో భాగం కానున్నాయి. ఈ ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను ఎన్‌సీసీ-మ్యాట్రిక్స్‌ అనే సంస్థ తీసుకుంది. ప్రాజెక్టు సరిగ్గా జరుగుతుందో లేదో పరిశీలించడానికి, పర్యవేక్షించడానికి కాలేజ్‌ డిజైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ థర్డ్‌పార్టీ ఆడిట్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (పీఎంసీ)గా పనిచేస్తోంది. అంటే, ఈ సంస్థ ప్రాజెక్టును పర్యవేక్షిస్తూ, అవసరమైన సూచనలు ఇస్తుంది. ‘జిల్లా ఆర్టీజీఎస్‌ కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, సీసీటీవీ డేటా సెంటర్‌, జిల్లా రియల్‌టైమ్‌ గవర్నెన్స్, ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ జిల్లాస్థాయి నెట్‌వర్క్‌ సెంటర్‌, కలెక్టర్, ఎస్పీలు సమీక్షించేందుకు సమావేశ మందిరం ఉంటుంది’ అని చెబుతున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి