Kasibugga Temple Stampede,Srikakulam Temple Stampede: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. 9మంది భక్తులు మృతి – devotees died in stampede in venkateswara swamy temple at kasibugga srikakulam district
Kasibugga Venkateswara Swamy Temple Stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. ఆలయంలో తొక్కిభక్తులు పెద్ద సంఖ్యలో ఉండటంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.సలాట జరిగి 9మంది చనిపోయారు. ఈ ఘటనలో పలువురు భక్తులకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఏకాదశి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి రావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హైలైట్:
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం
కాశీబుగ్గర ఆలయంలో తొక్కిసలాట
9మంది భక్తులు చనిపోయారు
కాశిబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయం తొక్కిసలాట(ఫోటోలు– Samayam Telugu)
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం.. కాశీబుగ్గలో ఉన్న విజయవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. తొమ్మిది మంది భక్తులు చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కార్తీక మాసం, ఏకాదశి శనివారం కావడంతో వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీగా వచ్చిన భక్తులు తరలివచ్చారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏకాదశి కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా వచ్చారని స్థానికులు చెబుతున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసి క్యూలైన్లకు సంబంధించిన రెయిలింగ్ ఊడిపడటంతో భక్తులు కిందపడిపోవడంతో తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు. ఆలయానికి వచ్చిన వారిలో ఎక్కువమంది మహిళా భక్తులు ఉన్నారని చెబుతున్నారు. ఈ ఆలయాన్ని 12 ఎకరాల్లో నిర్మించినట్లు చెబుతున్నారు. ఓ భక్తుడు తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనం దక్కలేదని కాశీబుగ్గలో నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏకాదశి రోజు ఇంతమంది భక్తులు వస్తారని అంచనా వేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందంటున్నారు. ఈ తీవ్ర విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీస్తున్నారు. ఇటు దేవాదాయశాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు అధికారుల్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి