ఢిల్లీ వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆందోళనకరంగా నమోదవుతుండగా, శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పసిపిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ కాలుష్యం నుంచి దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్లౌడ్ సీడింగ్ వంటి ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు.

