రాబోయే నెలల్లో బలహీనమైన లా నినా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, ఇది కఠినమైన శీతాకాలం అనే పుకార్లను కొట్టిపారేస్తుందని వాతావరణ శాఖ సూచించింది. అయితే, లా నినా ప్రభావం వల్ల ఈశాన్య రుతుపవనాల సమయంలో తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని IMD పేర్కొంది.
ఈశాన్య భారతదేశం, వాయువ్య భారతదేశం, దక్షిణ ద్వీపకల్పం, హిమాలయ ప్రాంతాలు మినహా చాలా ప్రాంతాల్లో పగటి పూట సాధారణం కంటే తక్కువగా ఉంటాయని తెలిపింది.
అలాగే వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు తప్ప, దేశంలోని చాలా ప్రాంతాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో రాత్రిపూట చలి ఎక్కువగా ఉండవచ్చు వెల్లడించింది.
ఇక నవంబర్ వర్షపాతం విషయానికొస్తే, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో ఐదు వాతావరణ ఉపవిభాగాలైన తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్, కోస్తాంధ్ర , యానాం, రాయలసీమ, కేరళలో ఈశాన్య రుతుపవనాలు సాధారణంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇది దీర్ఘకాలిక సగటు (LPA)లో 77-123% వాటా కలిగి ఉంటుందని పేర్కొంది.
మొత్తానికి నవంబర్ 2025లో దేశంలో వెచ్చని రాత్రులు, చల్లని పగళ్లు, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతారణ వాఖ అంచనా వేసింది. తమిళనాడు-పుదుచ్చేరిలో తక్కువ వర్షం, ఉత్తర భారతంలో రాత్రి చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.






