బాహుబలి.. పాన్ ఇండియా సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన మూవీ ఇది. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ ఇప్పుడు మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. 2015లో విడుదలైన బాహుబలి ది బిగినింగ్.. 2017లో రిలీజ్ అయిన బాహుబలి ది కన్క్లూజన్ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలలో ఈ సినిమా విధ్వంసం సృష్టించింది. ఇక ఇప్పుడు పదేళ్ల తర్వాత ఈ రెండు చిత్రాలు కలిపి ఒకే సినిమాగా బాహుబలి ది ఎపిక్ పేరుతో మరోసారి థియేటర్లలో విడుదల చేశారు. అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ సినిమా విడుదల కావడంతో థియేటర్ల వద్ద మరోసారి హడావిడి మొదలైంది. చాలా చోట్ల ఉదయం షోలు స్టా్ర్ట్ అయ్యేలోపు టికెట్స్ హౌస్ ఫుల్ అయ్యాయి.
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి.. సినిమాలు వదిలేసి గూగుల్ కంపెనీ సీఈఓగా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?
మొత్తానికి పదేళ్ల తర్వాత కూడా థియేటర్లలో అదే రేంజ్ హడావిడి కనిపించింది. ఇక ఈ సినిమా మొదటి రోజే రూ.10.4 కోట్లు నెట్, రూ.18 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇదివరకు రీరిలీజ్ అయిన సినిమాల్లో ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఎప్పటిలాగే మరోసారి రీరిలీజ్ లోనూ రికార్డ్స్ కొల్లగొట్టారు ప్రభాస్. గతంలో విజయ్ దళపతి నటించిన గిల్ సినిమాను రీరిలీజ్ చేయగా.. 10 కోట్లు వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమా రూ.8 కోట్లు.. మహేష్ బాబు బిజినెస్ మెన్.. రూ.5.27 కోట్లు.. మురారి.. రూ.5 కోట్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేసింది బాహుబలి ది ఎపిక్.
ఇవి కూడా చదవండి : Actor : 26 అనాథాశ్రమాలు.. 46 ఉచిత పాఠశాలలు.. రియల్ లైఫ్ హీరో.. సమాజం కోసం జీవితం ఇచ్చిన హీరో..
పదేళ్లైనా ప్రభాస్ క్రేజ్.. రాజమౌళీ మాస్టర్ మేకింగ్.. భారతీయ సినిమా స్థాయికి ఇది స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తోంది. బాహుబలి సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. బాహుబలి ది కన్క్లూజన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లక పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు మరోసారి రీరిలీజ్ లోనూ సంచలనం సృష్టిస్తుంది.
ఇవి కూడా చదవండి : Actress: 150కి పైగా సీరియల్స్.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలిసే భిక్షాటన చేస్తూ ..

