సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హారర్, సస్పెన్స్, రొమాంటిక్.. ఇలా ఏ జానర్ అయినా జనాలు ఆదరిస్తుంటారు. అయితే కొన్ని సినిమాల్లో మాత్రం బుర్రపాడయ్యే ట్విస్టులు.. ఊహించని సస్పెన్స్ సీన్స్ ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సైతే ప్రేక్షకులను అనుక్షణం ఉత్కంఠ కలిగిస్తుంటాయి. ఇప్పడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సైతం ఆ కోవలోకి చెందినదే. ఓ డేంజరస్ పందెం చుట్టూ తిరిగే కథే ఈ సినిమా. ఆ మూవీ పేరు క్రూయెల్ ఇంటెన్షన్స్ (Cruel Intentions). 1999లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ అమెరికన్ రొమాంటిక్ థ్రిల్రర్ డ్రామాకు రాజర్ కంబుల్ దర్శకత్వం వహించారు.
ఇవి కూడా చదవండి : Actor : 26 అనాథాశ్రమాలు.. 46 ఉచిత పాఠశాలలు.. రియల్ లైఫ్ హీరో.. సమాజం కోసం జీవితం ఇచ్చిన హీరో..
ఇందులో సారా మిషెల్ గెల్లార్, ర్యాన్ ఫిలిప్పే, రీస్ విథర్ స్పూన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా దాదాపు 1 గంట 37 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది. ఈ చిత్రానికి IMDBలో 6.8 రేటింగ్ ఉండగా.. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ అవుతుంది. నిరంతరం సస్పెన్స్, థ్రిల్లర్ డ్రామాలు చూసేందుకు ఇష్టపడేవారికి ఈ సినిమా సరైన ఛాయిస్.
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి.. సినిమాలు వదిలేసి గూగుల్ కంపెనీ సీఈఓగా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?
ఈ సినిమా న్యూయర్క్ నగరంలోని ఒక రిచ్ హైస్కూల్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో సరదాగా మొదలైన ఒక గేమ్ ఆ తర్వాత సీరియస్ గా మారుతుంది. ప్రేమ, పందెం, గతం ఈ అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. ఆద్యంతం ఊహించని ట్విస్టులతో సాగుతుంది. ఇక క్లైమాక్స్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ మూవీ రెండు ఓటీటీలో అందుబాటులో ఉండడం విశేషం.
ఇవి కూడా చదవండి : Actress: 150కి పైగా సీరియల్స్.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలిసే భిక్షాటన చేస్తూ ..

