సినిమా ప్రపంచంలో నటిగా తనదైన ముద్ర వేసింది. చిన్న వయసులోనే నటిగా తెరంగేట్రం చేసిన ఆమె.. కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ నటీనటులు కావడంతో చిన్నప్పటి నుంచే సినిమాలు, నటనపై ఆసక్తి పెంచుకుంది. కుటుంబ ఆర్థిక సమస్యలను అధిగమించడానికి కేవలం 12 ఏళ్ల వయసులోనే తన సినీప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. చిన్నప్పుడు కాస్త బొద్దుగా ఉండడంతో చిన్నప్పుడు పాఠశాలలో ఆమెను తన తోటి విద్యా్ర్థులు ఏడిపించేవారట. కానీ ఆ అమ్మాయి ఏకంగా 150కి పైగా సినిమాల్లో కథానాయికగా నటించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. ఆమె జాతీయ అవార్డుతోపాటు మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అందమైన అమ్మాయి మరెవరో కాదు.. సీనియర్ హీరోయిన్ రేఖ.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
ఆమెను అందరూ రేఖాజీ అని పిలుస్తుంటారు. తమిళ పరిశ్రమలోని దిగ్గజ నటుడు జెమినీ గణేషన్, తెలుగు నటి పుష్పవల్లి దంపతుల కుమార్తె.చిన్నప్పటి నుంచి తండ్రికి దూరంగానే రేఖ పెరిగింది. తన తండ్రి తమ కుటుంబాన్ని చిన్నప్పుడే వదిలేశాడని.. అందుకే తన తండ్రితో తనకు బాల్య జ్ఞాపకాలు లేవని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తండ్రి లేకపోవడం అనే విషయం తనను ఎప్పుడూ బాధపెట్టలేదని..ఎందుకంటే తన తల్లి ఎంతో ప్రేమగా తమను పెంచిందని తెలిపింది. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్ రేఖ. హిందీలో దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది.
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..
కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను రేఖ పిచ్చిగా ప్రేమించిందని అప్పట్లో ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడిచింది. అయితే అప్పటికే అమితాబ్ కు పెళ్లి కావడంతో రేఖ తన ప్రేమను వదులుకుంది. మూడేళ్ల వయసులోనే 1958లో వచ్చిన ఇంటిగుట్టు సినిమాలో బాలనటిగా కనిపించింది రేఖ. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 1990లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్ ను మొదటి సారి కలుకుంది. వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఏడాదిలోపే ముఖేష్ ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత రేఖ మరో పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆమె వయసు 71 సంవత్సరాలు. ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తుంది.
ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?
Rekha New
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..

