హైదరాబాద్‌లో మెట్రో రాకతో ఎంతో మంది ఉద్యోగులకు ట్రాఫిక్ చిక్కులు తప్పాయి. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా చాలా మంది మెట్రో ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మెట్రో రైలు ప్రయాణ వేళల్లో కీలక మార్పులు జరిగాయి. నవంబర్ 3 నుంచి ఈ కొత్త సమయాలు అమలులోకి రానున్నాయి. మెట్రో రైలు సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇకపై ఉదయం 6:00 గంటల నుంచి 11:00 గంటల వరకు ట్రైన్స్ నడుస్తాయి. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి ఈ వేళల్లో ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
ఇప్పటివరకు ఇలా:
ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. శనివారం రోజున ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు.. ఆదివారం రోజున ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లు నడుస్తున్నాయి. తాజా నిర్ణయంతో వీకెండ్స్, వీక్ డేస్ అనే తేడా లేకుండా ప్రయాణికులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైలు సేవలను వినియోగించుకోవచ్చు.
Revised Metro Timings | Effective 03 Nov 2025
Metro services will now run from 6:00 AM to 11:00 PM from all terminal stations on all days of the week
We request passengers to plan their travel accordingly.
Thank you for your cooperation.
[Hyderabad Metro, L&T Hyderabad… pic.twitter.com/BJlsnUSnIw
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) November 1, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

