తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశిలో రాశినాథుడు శుక్రుడి సంచారం, దశమ స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం వంటి కారణాల వల్ల వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి బాగా అవకాశం ఉంది. కొత్త లక్ష్యాలు, కొత్త ప్రాజెక్టులు చేతికి అంది వస్తాయి. బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపో వచ్చు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వ్యాపారాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది.

