బిగ్ బాస్ సీజన్ 9.. అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వీకెండ్ ప్రోమో వచ్చేసింది. నిజానికి వారం మొత్తం కంటెస్టెంట్స్ చేసిన తప్పులను నాగార్జున కడిగిపారేసేది శనివారం మాత్రమే. అందుకే ఈరోజు ఎపిసోడ్ ప్రోమో కోసం ఉదయం నుంచి ప్రేక్షకులు తెగ వెయిట్ చేస్తుంటారు. ఇక ఈవారం శనివారం నాటి ఎపిసోడ్ ఆలస్యంగా రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో.. రావడంతోనే ఒక్కో కంటెస్టెంట్ ఫోటో ఫ్రేమ్ పై కత్తి గుచ్చారు నాగ్. ముందుగా భరణి, కళ్యాణ్, సంజన, ఇమ్మాన్యుయేల్ ఫోటోఫ్రేమ్స్ పై కత్తి గుచ్చిన నాగ్.. ఆ తర్వాత సంజన నీకు నామినేషన్లలోకి రాగానే చిన్న కోపం, చిరాకు, టెన్షన్ ఇవన్నీ వచ్చేస్తాయా అని అడిగారు.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
సుమన్ శెట్టిని తొక్కలో కెప్టెన్ అని అనడానికి కారణం నీకు తెలుగు రాదని అంటావ్..అని అనడంతో సంజన క్లారిటీ ఇచ్చేందుకు ట్రై చేసింది. నామినేషన్స్ తర్వాత లొపలికి వచ్చి సుమన్ ను గిల్లావ్ అంటూ సీరియస్ అయ్యారు నాగ్. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి.. కానీ బ్రెయిన్ లెస్, సెన్స్ లెస్, హు ఆర్ యూ అని అనేస్తావా.. అని క్లాస్ తీసుకున్నారు. ఇక మాధురి గురివింద గింజలాగా ప్రవర్తిస్తుందని అన్నారు. రేషన్ మేనేజర్ విషయంలో నీ అభిప్రాయం ఏంటీ అని కళ్యాణ్ అడగ్గా.. టైమింగ్, అబ్జర్వింగ్ లో గానీ వీక్ అంటూ తనూజను ఊద్దేశించి చెప్పాడు కళ్యాణ్. హౌస్మేట్స్ అందరికీ ఆర్డర్ చేసే రైట్స్ ఉంటుందా అని కెప్టెన్ దివ్యను అడగ్గా.. సలహా ఇవ్వచ్చు కానీ.. ఫైనల్ డెసిషన్ రేషన్ మేనేజర్ తీసుకోవాల్సి ఉంటుంది అని దివ్య చెప్పడంతో కళ్యాణ్, తనూజ గొడవ పడిన వీడియోను ప్లే చేసి చూపించారు. దీంతో ఆ విషయంలో తనూజ తప్పు లేదు.. ఈవారం మొత్తం కళ్యాణ్ తనూజను విసిగిస్తూనే ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చింది దివ్య.
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..
ఇక తర్వాత రీతూ, పవన్ గొడవ పడిన వీడియోను ప్లే చేసి పవన్ ప్రవర్తనపై ప్రేక్షకుల అభిప్రాయాలను అడగ్గా.. అలా తోసేడం తప్పు అని ఆన్సర్ ఇచ్చారు. దీంతో పవన్ తన బ్యాగ్ సర్దుకొని బయటకు వెళ్లాలని ఆదేశించాడు నాగ్. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కు గట్టిగానే క్లాస్ తీసుకోబోతున్నారు నాగ్.
ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..

