అమరావతి ఓఆర్ఆర్‌కు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. గుంటూరు జిల్లాలోని 11 మండలాల్లో భూసేకరణకు అడుగులు పడుతున్నాయి. 11 మండలాల్లోని 40 గ్రామాల్లో భూసేకరణకు కసరత్తు జరుగుతోంది. భూసేకరణ కోసం ప్రత్యేక అధికారిగా నియమించిన శ్రీవాత్సవ ఈ విషయంపై దృష్టి సారించారు. మరోవైపు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులను 12 ప్యాకేజీలుగా విభజించి చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోవైపు మొత్తం ఐదు జిల్లాల్లో అమరావతి ఓఆర్ఆర్ కోసం భూసేకరణ చేపట్టనున్నారు.

దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి, గుంటూరు తూర్పు, చేబ్రోలు, వట్టిచెరుకూరు, గుంటూరు పశ్చిమ, తాడికొండ, మేడికొండూరు, మంగళగిరి, పెదకాకాని మండలాల్లో ఓఆర్ఆర్ కోసం భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఆయా మండలాల తహశీల్దార్లు ఇప్పటికే భూసేకరణ కోసం ఎల్పీ షెడ్యూల్స్ తయారు చేశారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రెవెన్యూ అధికారులు ఏడు మండలాలల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశారు. మంగళగిరి. గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, చేబ్రోలు మండలాల ఎల్‌పీ షెడ్యూల్స్ గురించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇవి పూర్తైన తర్వాత ఓఆర్ఆర్ భూసేకరణ కోసం ప్రకటన ఇవ్వాలని భావిస్తున్నారు.
మొంథా ఎఫెక్ట్.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు
మరోవైపు అమరావతి చుట్టూ 190 కిలోమీటర్ల పొడవుతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్‌హెచ్‌ఏఐ డీపీఆర్ సిద్ధం చేసి, దిల్లీ ప్రధాన కార్యాలయానికి ఇప్పటికే అందజేసింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ వ్యయం రూ.24,791 కోట్లుగా అంచనా వేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పొడవు 158 కిలోమీటర్లు కాగా, అంతకంటే ఎక్కువగా 190 కిలోమీటర్ల పొడవుతో అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మించనున్నారు. అలాగే 12 ప్యాకేజీలుగా విభజించి అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఆరు వరుసల ప్రధాన రహదారితో పాటుగా, రెండు వైపులా సర్వీస్ రోడ్లు కలిపి నిర్మించనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 140 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. ఆ మేరకు భూసేకరణ చేపట్టనున్నారు.మొత్తం ఐదు జిల్లాల్లో అమరావతి ఓఆర్ఆర్ కోసం భూసేకరణ జరపనుంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం ఐదు జిల్లాలకు ఐదుగురు సంయుక్త కలెక్టర్లను నియమించింది. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా , పల్నాడు జిల్లా, ఏలూరు జిల్లాల్లో అమరావతి ఓఆర్ఆర్ కోసం భూసేకరణ చేపట్టనున్నారు.


