గత కొన్ని రోజులుగా రాజశేఖర్ పేరు నెట్టింట బాగా వైరలవుతోంది. ఆయన హీరోగా నటించిన సినిమాలోని
‘ఇదేటమ్మా మాయ మాయ’ అనే పాత పాట ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కే-ర్యాంప్ సినిమాలో ఒక సన్నివేశంలో హీరో ఈ పాటకు సరదాగా స్టెప్పులేస్తాడు. అంతే ఒక్కసారిగా ఈ పాట నెట్టింట వైరలైపోయింది. ఇన్ స్టా గ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్.. ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపిస్తోంది. చాలామంది ఈ పాటను రీక్రియేట్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ట్రెండింగ్ సాంగ్ ను స్వయంగా రాజశేఖర్ హమ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. కాగా ‘ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్’ తర్వాత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ ఇప్పుడు మరో కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న బైకర్ లో ఆయన ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు ఈ విషయాన్ని సీక్రెట్ గానే ఉంచింది చిత్ర బృందం. అయితే శనివారం (నవంబర్ 01)న జరిగిన బైకర్ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ లో రాజశేఖర్ తళుక్కుమన్నారు. తన భార్య జీవితతో కలిసి ఈ ఈవెంట్ కు హాజరయ్యారీ సీనియార్ యాక్టర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో చాలా రోజులుగా తాను ఒక వ్యాధితో బాధపడుతున్నానంటూ షాకింగ్ విషయం చెప్పారు.
చాన్నాళ్ల నుంచి తాను ‘ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్’ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని బైకర్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు. అయితే ఇదే విషయంపై గతంలోనూ రాజశేఖర్ మాట్లాడారు. ‘ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఒక జీర్ణశయాంతర సమస్య. కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం లాంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఈ సమస్య వల్లనే నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. రాత్రిళ్లు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా చాలా ఇబ్బందిగా ఉంటోంది. దీనివల్ల చాలా కోపం వస్తుండేదని, నా గురించి తెలిసిన వాళ్లు నేను ఏమన్నా పట్టించుకునేవారు కాదు’ అని కొన్ని రోజుల క్రితం ఆవేదన వ్యక్తం చేశారు రాజశేఖర్. మళ్లీ ఇప్పుడు ఈ వ్యాధి గురించి చెప్పడంతో చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి
బైకర్ సినిమా ఈవెంట్ లో రాజశేఖర్..
The squad of #BIKER from the First Lap – The Glimpse Launch Event #BikerGlimpse out now!
▶️ https://t.co/PJSHmhx2Zm
GRAND RELEASE WORLDWIDE ON DECEMBER 6th #BIKERMovie #GoAllTheWay pic.twitter.com/Dv1sIUhq8d
— Sai Satish (@PROSaiSatish) November 1, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

