ఏపీ ప్రభుత్వం మౌలిక వసతుల నిర్మాణానికి పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫ్లైఓవర్లు, ఆర్వోబీలు, జాతీయ రహదారుల నిర్మాణాన్ని కేంద్రం సహకారంతో వేగవంతం చేసింది. తాజాగా మరోచోట ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. మంగళగిరిలో రూ.200 కోట్లతో 1.25 కిలోమీటర్ల మేరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ చేపట్టి.. ఖరారు చేశారు. త్వరలోనే పనులు మొదలుపెట్టనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే విజయవాడ వైపు వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు.

*అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్‌డేట్.. 40 గ్రామాల్లో భూసేకరణ!
మంగళగిరిలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు. అందులో భాగంగా వాహనాల రద్దీని నివారించడానికి, వాహనదారులకు అసౌకర్యం లేకుండా ఉండేందుకు మంగళగిరిలో రోడ్డు నిర్మాణాలను శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా మంగళగిరిలో మరో ప్రాజెక్టును చేపట్టారు. మంగళగిరిలోని గౌతమ బుద్ధా రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. 1.25 కిలోమీటర్ల మేరకు ఈ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.200 కోట్లతోఅమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్లను మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది.
*మైనారిటీ యువతకు గుడ్ న్యూస్.. పోలీస్ , టీచర్ ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ..
మరోవైపు ఈ-15 రోడ్డుకు ఫ్లైఓవర్ లింక్ చేస్తూ పాత బస్టాండ్ సర్కిల్ వద్ద టీ ఆకారంలో ఈ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. పాత బస్టాండ్ నుంచి గుంటూరు వైపుగా 600 మీటర్లు, అలాగే రోడ్డు భవనాల శాఖ బంగ్లా వరకూ 650 మీటర్లు.. మొత్తంగా 1.25 కిలోమీటర్ల మేరకు ఫ్లైఓవర్ నిర్మాణం జరగనుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయితే విజయవాడ వైపు రాకపోకలు సాగించే వాహనదారులకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
*ఉపాధ్యాయులకు శుభవార్త.. తొలిసారిగా.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
మరోవైపు అమరావతి టౌన్ షిప్ వద్ద నుంచి నిడమర్రు రైల్వేగేటుపై ఆర్వోబీ నిర్మాణాన్ని రైల్వేశాఖ చేపట్టింది. ఇందుకోసం రూ.129.18 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించిన పూర్తి స్థాయి అనుమతులు వచ్చిన తర్వాత పనులు చేపట్టనున్నారు. అలాగే ఆర్వోబీ నిర్మాణం పూర్తి అయితే దీనికి అనుసంధానంగా నాలుగు లైన్ల సర్వీసు రోడ్ల నిర్మాణాన్నిఅమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టనుంది. ఈ పనుల కోసం రూ.77 రోట్లతో టెండర్ల ప్రక్రియ కూడా పూర్తైంది. ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తి అయితే మంగళగిరి రూపురేఖలు మారిపోతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.


