కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పలు ఔషధాల రేట్లు తగ్గాయి. అయితే అక్కడక్కడా పాత ధరలకే మెడికల్ షాపులలో మందులు విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మందులు విక్రయించిన సమయాల్లో బిల్లులు ఇవ్వటం లేదని.. దీనికి పలు సాకులు చెప్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని ఔషధ నియంత్రణ అధికారులు పలు కీలక సూచనలు చేశారు. మెడికల్ షాపులలో ఔషధాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు. అలాగే రూల్స్‌కు విరుద్ధంగా అమ్ముతున్నట్లు తేలితే.. తమకు సమాచారం ఇవ్వాలంటూ ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచారు.

*మైనారిటీ యువతకు గుడ్ న్యూస్.. పోలీస్ , టీచర్ ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ..
ఈ నేపథ్యంలో ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. మెడికల్ షాపుల వద్ద మందులు కొన్నప్పుడు.. బిల్లు తీసుకోవాలని, జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం పొందాలని సూచిస్తున్నారు. అలాగే జీఎస్టీ రేట్ల తగ్గింపుపై ప్రతి మెడికల్ షాప్ వద్ద కచ్చితంగా సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. టెక్నికల్ కారణాలు చెప్పకుండా సాప్ట్‌వేర్‌లో మార్పులు చేసి.. ఔషధాలు కొనుగోలు చేసినవారికి కచ్చితంగా బిల్లు ఇవ్వాలని చెప్తున్నారు.
*అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక అప్‌డేట్.. 40 గ్రామాల్లో భూసేకరణ!
మరోవైపు మెడికల్ షాపులలో నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలు అమ్ముతున్నట్లు తేలితే.. వెంటనే తమ దృష్టికి చేరవేయాలని విజయనగరం జిల్లాలోని ఔషధ నియంత్రణ అధికారులు తెలిపారు. ఇందుకోసం 94901 53339, 73829 34399, 73829 34327 నంబర్లను అందుబాటులో ఉంచారు.
*కొత్త ఫ్లైఓవర్.. ఆ ప్రాంతంలోనే.. విజయవాడకు దూసుకెళ్లిపోవచ్చు..
మరోవైపు జీఎస్టీ రేట్ల తగ్గింపుతో.. యాంటీబయాటిక్స్, యాంటీ డయాబెటిక్, పెయిన్ కిల్లర్స్ వంటి మందుల రేట్లు తగ్గాయి. గతంలో వీటిపై 12 శాతం జీఎస్టీ ఉండగా.. తాజాగా దీనిని 5 శాతానికి తగ్గించారు. అలాగే క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాల మందులపై జీఎస్టీని 12 శాతం నుంచి సున్నా శాతానికి తెచ్చారు. అలాగే డయాగ్నోస్టిక్స్‌కు సంబంధించిన కొన్ని వైద్య పరికరాల ధరలను కూడా 5 శాతం జీఎస్టీలోకి తీసుకువచ్చారు. ఐవీ సెట్లు, సెలూన్ స్టాండ్లు, మాస్క్స్ వంటి వాటి ధరలు కూడా తగ్గాయి. తగ్గింపు ధరలకు ఔషధాలను విక్రయించకుంటే పైన పేర్కొన్న నంబర్లను సంప్రదించాలని సూచించారు.


