Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Actress : నన్ను నేను కోల్పోయాను.. అతడి మరణం నన్ను పూర్తిగా మార్చేసింది.. బిగ్ బాస్ బ్యూటీ..

12 November 2025

Singer Chinmayi: ‘జానీ మాస్టర్ భార్య నాకు ఫోన్ చేసి’.. సింగర్ చిన్మయి సంచలన ఆరోపణలు

12 November 2025

RCB Home Ground: ఆర్‌సీబీ అడ్డాగా వైజాగ్ స్టేడియం.. మారిన బెంగళూరు హోమ్ గ్రౌండ్‌..?

12 November 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kasibugga Stampede Compensation,కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన.. బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం.. – ap government annouced compensation to kasibugga temple stampede victim families
ఆంధ్రప్రదేశ్

Kasibugga Stampede Compensation,కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన.. బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం.. – ap government annouced compensation to kasibugga temple stampede victim families

.By .1 November 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kasibugga Stampede Compensation,కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన.. బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం.. – ap government annouced compensation to kasibugga temple stampede victim families
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడినవారికి రూ.3 లక్షలు పరిహారం ప్రకటించింది. మంత్రి నారా లోకేష్ ఘటనాస్థలిని పరిశీలించారు. పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. బాధితులకు పరిహారం ప్రకటించారు, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందిస్తామని.. వారికి అండగా ఉంటామని నారా లోకేష్ వెల్లడించారు.

nara lokesh
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన.. బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..(ఫోటోలు– Samayam Telugu)
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శనివారం పెను విషాదం చోటుచేసుకుంది. వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 16 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మంత్రి నారా లోకేష్ కాశీబుగ్గ ఆలయాన్ని సందర్శించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. గాయపడి పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్.. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరుఫున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.

మరోవైపు 94 ఏళ్ల వృద్ధుడు తన సొంత ఖర్చుతో ఈ ఆలయం నిర్మించారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అయితే భక్తులు ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించలేకపోయారని తెలిపారు. భక్తుల కోసం బారీకేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ.. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అవి సరిపోలేదన్నారు. తొక్కిసలాట సమాచారం తెలిసిన వెంటనే అధికారులను, ఎమ్మెల్యేను అప్రమత్తం చేశామని నారా లోకేష్ వివరించారు. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రులకు తరలించామన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. మరోవైపు తొక్కిసలాట ఘటనలో గాయపడి పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 16 మందికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్లు నారా లోకేష్ వెల్లడించారు. తీవ్రంగా గాయపడినవారికి మెరుగైన చికిత్స అందిస్తామని నారా లోకేష్ వెల్లడించారు.

మరోవైపు కార్తీక ఏకాదశి పర్వదినం రోజు కావటంతో శనివారం రోజున వెంకటేశ్వరస్వామి ఆలయానికి భారీగా భక్తులు వచ్చారు. కాశీబుగ్గతో పాటుగా పలాస, మందస, వజ్రపుకొత్తూరు వంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా వచ్చారు. అయితే అంచనా వేసిన దానికంటే అధికసంఖ్యలో భక్తులు రావటంతో నిర్వహణ కష్టమైపోయింది. శనివారం ఉదయం 11 గంటల 45 నిమిషాల సమయంలో ప్రవేశ మార్గం వద్ద తొక్కిసలాట జరిగింది. దీంతో రెయిలింగ్ విరిగిపడటంతో ఆలయానికి వచ్చిన భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు.ఈ ప్రమాదంలో 9 మంది భక్తులు చనిపోయారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి