టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న కొత్త సినిమా జటాధర. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తెలుగు తెరకు పరిచయమవుతోంది. అలాగే గతంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శిల్పా శిరోద్కర్ చాలా ఏళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించనుంది. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో, ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రేరణ అరోరాతో కలిసి శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అక్షయ్ కేజ్రీవాల్ కుసుమ్ అరోరా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 07న, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శనివారం (నవంబర్ 01)న జటాధర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. హీరో సుధీర్ బాబుతో సహా చిత్ర బృందమంతా ఈ ఈవెంట్ కు హాజరైంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. ‘నేను నెపో కిడ్‌ని కాదు. 200 రూపాయలు కట్టి జిమ్ చేసేవాళ్లం. కృష్ణగారి అల్లుడు, మహేష్ బావగా నాకు దక్కింది ఎక్స్ ట్రా కాఫీ మాత్రమే. నా తొమ్మిదినెలల కొడుకును చేతిలో పెట్టుకుని కెరీర్ గురించి ఆలోచించా నాకు ఆకలి బాధ తెలియదు కానీ, ముద్ద దిగకపోవడం తెలుసు. నాకు కృష్ణానగర్ కష్టాలు తెలియదు కానీ, కారులో కూర్చుని ఏడవడం గురించి తెలుసు. మహేష్‌ని ఎప్పుడూ ఏ హెల్ప్ అడగలేదు.ఇక ఈ సినిమాలో శిల్పా పెర్ఫార్మెన్స్ తో నేను లవ్‌లో పడ్డాను. నిద్రపోతే కల్లో కొచ్చే కేరక్టర్ సోనాక్షి. ఆరోగ్యం బాలేకపోవడం వల్లనే ఆమె ప్రమోషన్లకు రాలేదు‘ అని సుధీర్ బాబు చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
ఇదే సినిమా ఈవెంట్ లో శిల్పా శిరోద్కర్ మాట్లాడుతూ.. ‘ నేను ప్రెజెంట్‌లో ఉండాలని అనుకుంటా. పాజ్ బటన్ మీద నాకు పెద్ద నమ్మకం లేదు. జీవితాన్ని కంటిన్యూ చేయాలనే అనుకుంటాను‘ అని పేర్కొంది. ఇక ఇదే ఈవెంట్ కు గెస్టుగా హాజరైన హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాను శివుడిని నమ్ముతానన్న డైరెక్టర్ త్వరలోనే మహేష్ బాబు తో సినిమా చేస్తాననన్నాడు.
జటాధర ఈవెంట్ లో సుధీర్ బాబు స్పీచ్.. వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

