ఒక మంచి ఇల్లు కొనాలనే కోరిక, కల, ఆశయం చాలా మందికి ఉంటుంది. ఏదో ఒక రోజు తమ కష్టార్జితంతో ఒక అందమైన ఇంటిని నిర్మించుకోవాలని లేదా కొనాలని అనుకుంటారు. అయితే కొంతమంది కలలు కూడా రిచ్‌గా ఉంటాయి. ఒక రూ.కోటి విలువైన ఇళ్లు కొనాలని టార్గెట్‌గా పెట్టుకుంటారు. కానీ, వాళ్లు నెల జీతానికి పని చేస్తూ ఉంటారు. మరి నెల జీతంలో ఇంటి ఖర్చులు, ఈఎంఐలు, పిల్లల చదువులు, ఇతర ఖర్చులు పోను ఎంత సేవ్ చేసుకుంటే కోటి విలువైన ఇల్లు సొంతం అవుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కొంతమంది ఇల్లు కొనే సమయంలో తమ ఇంటి బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకోరు. ప్రతి నెలా EMI చెల్లించాల్సి ఉంటుందని భావించి ఖరీదైన ఇల్లు కొంటారు, కానీ ఇల్లు కొనే సమయంలో ఎల్లప్పుడూ మీ నెలవారీ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంటి బడ్జెట్‌ను సిద్ధం చేసుకోండి.
ఇంటి బడ్జెట్‌ను ఎలా సెట్ చేయాలి?
మీ ఇంటికి బడ్జెట్ నిర్ణయించుకోవడానికి మీరు మీ ఆదాయాన్ని చూడాలి. మీ వార్షిక ఆదాయం రూ.10 లక్షలు అయితే మీరు రూ.30 నుండి 50 లక్షల బడ్జెట్‌తో ఇల్లు కొనవచ్చు.
1 కోటి విలువైన ఇల్లు కొనాలంటే ఎంత జీతం అవసరం?
మీరు కోటి రూపాయల విలువైన ఇల్లు కొనాలనుకుంటే మీ వార్షిక ఆదాయం రూ.20 లక్షల వరకు ఉండాలి, అంటే మీ నెలవారీ జీతం రూ.1.66 లక్షలు ఉండాలి. మీరు హోమ్ లోన్ తీసుకుంటుంటే ఇంటి ధరలో 40 శాతం వరకు డౌన్ పేమెంట్ చేయడానికి ప్రయత్నించండి. అంటే రూ.40 లక్షలు. అలాగే మీ నెలవారీ EMIని మీ నెలవారీ జీతంలో 30 శాతానికి మించి ఉంచవద్దు. హోమ్ లోన్ కాలపరిమితిని ఎక్కువ కాలం ఉంచుకోకండి, ఎందుకంటే దీనివల్ల మీరు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. ఈ కాలపరిమితి 20 సంవత్సరాలు మించకూడదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

