బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా SSMB29. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు. SSMB29 అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలల క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా.. ఇటీవల మహేష్ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. మెడలో పరమశివుని త్రిశూలంతోపాటు ఢమరుకం, నామాలు, నంది, రుద్రాక్షతో కూడిన లాకెట్ ఉన్నట్లు చూపించడంతో.. సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సమయంలోనే ట్విట్టర్ వేదికగా ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు మహేష్. సోషల్ మీడియాలో జక్కన్నను ట్యాగ్ చేస్తూ SSMB 29 గురించి వరుస పోస్టులు చేశారు. రాజమౌళి సైతం మహేష్ ప్రశ్నలకు ఆన్సర్స్ ఇస్తుండగా.. మధ్యలో ప్రియాంక చోప్రా కౌంటర్స్ వేసింది.
ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా నవంబర్ నెలలో SSMB29 నుంచి అప్డేట్ వస్తుందని రాజమౌళి ప్రకటించారు. ఇప్పుడు నవంబర్ నెల రావడంతో సోషల్మీడియాలో #noveMBerwillbehiSStoRic, #noveMBer ట్యాగ్ లైన్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మహేష్ నెట్టింట యాక్టివ్ అవుతూ.. “ఆల్రెడీ నవంబర్ వచ్చేసింది” అంటూ జక్కన్నకు గుర్తు చేశారు. ఇందుకు రాజమౌళి రియాక్ట్ అవుతూ.. “అవును..నవంబర్ వచ్చింది. ఈ నెలలో ఏ సినిమాలకు రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావు ” అని అడగ్గా.. “మీరు ఎప్పటి నుంచో తయారు చేస్తున్న మహాభారతం సినిమాకు ఇస్తాను” అంటూ పంచ్ వేశారు మహేష్. “ముందుగా.. నవంబర్ నెలలో మీరు మాకు ఏదో హామీ ఇచ్చారు. దయచేసి మీ మాట నిలబెట్టుకోండి ” అని మహేష్ అనడంతో.. జక్కన్న రియాక్ట్ అవుతూ.. “మహేష్.. ఇప్పుడే కదా మొదలైంది. నెమ్మదిగా మేము ఒక్కొక్కటిగా వెల్లడిస్తాము. “అని ఆన్సర్ ఇచ్చారు.
It’s November already @ssrajamouli 👀
— Mahesh Babu (@urstrulyMahesh) November 1, 2025
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..
“ఎంత నెమ్మదిగా ఇస్తారు సార్.. ? 2030లో స్టార్ట్ చేద్దామా.. ? ” అని ప్రశ్నించారు మహేష్. “మీ సమాచారం కోసం మన దేశీ పాప ప్రియాంక చోప్రా జనవరి నుంచి హైదరాబాద్ లోని ప్రతి వీధిలో తన ఇన్ స్టా స్టోరీలను పోస్ట్ చేస్తుంది ” అంటూ మధ్యలోకి ప్రియాంక చోప్రాను లాగారు. దీంతో ప్రియాంక రియాక్ట్ అవుతూ.. “హలో హీరో.. సెట్ లో నువ్వు నాతో పంచుకునే స్టోరీలను నేనే లీక్ చేయాలనుకుంటున్నావా.. ? మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా ఏసేస్తా ” అంటూ మహేష్ కు కౌంటరిచ్చింది. “ప్రియాంక చోప్రా నటిస్తుందనే విషయాన్ని నువ్వు ఎందుకు బయటపెట్టావ్ మహేష్.. నువ్వు సర్ ప్రైజ్ నాశనం చేశావ్” అంటూ జక్కన్న రియాక్ట్ కాగా.. “సర్ ప్రైజా.. ? మీ ఉద్దేశ్యంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక సర్ ప్రైజ్ అని చెప్పాలనుకుంటున్నారా ?” అంటూ మరో లీక్ చేశారు మహేష్. దీంతో మధ్యలోకి పృథ్వీరాజ్ ఎంటర్ అయ్యారు.
Helloooo!! hero!!! You want me to leak all the stories you share with me on set? Mind lo fix aithe blind ga esestha.. 👊🏻
— PRIYANKA (@priyankachopra) November 1, 2025
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
“రాజమౌళి సార్.. నేను ఇలాగే హైదరాబాద్ వెకేషన్ అని తిరిగితే నా ఫ్యామిలీ నన్ను అనుమానించడం స్టార్ట్ చేస్తారు” అంటూ ట్వీట్ చేశారు పృథ్వీరాజ్. దీంతో జక్కన్న రియాక్ట్ అవుతూ..”మహేష్ నువ్వు ఇప్పుడు అన్నీ నాశనం చేశావు ” అని అనడంతో “సరే ఒక సంధీ చేసుకుందాం. అందరికీ తెలిసిన ఏదో ఒక విషయాన్ని రేపు ప్రకటించండి. మీరు ఎప్పటికీ దానిని సర్ ప్రైజ్ అనుకుంటే” అంటూ మరోసారి పంచ్ వేశారు. ” డీల్ఓకే.. అతిగా వ్యంగ్యంగా మాట్లాడినందుకు జరిమానాగా మీ ఫస్ట్ లుక్ విడుదలను మరింత ఆలస్యం చేయాలని నిర్ణయించుకున్నాను ” అంటూ మెలిక పెట్టారు రాజమౌళి. ఆకస్మాత్తుగా సోషల్ మీడియాలో SSMB 29 గురించి ట్వీట్ల వర్షం కురిపిస్తూ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు మహేష్. మొత్తానికి ఈనెలలో మోస్ట్ అవైటెడ్ అప్డేట్ రాబోతుందని చెప్పకనే చెప్పారు. అయితే మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ కాకుండా ప్రియాంక, పృథ్వీరాజ్ పాత్రలకు సంబంధించిన అప్డేట్స్ రానున్నట్లు జక్కన్న, మహేష్ హింట్ ఇచ్చేశారు.
Okay, deal. But penalty for excess sarcasm. 🤨 I’ve decided to delay the release of your first look. 😡😡😡😡😡
— rajamouli ss (@ssrajamouli) November 1, 2025
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..

