బిజినెస్ చేయాలనే ఆలోచన పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ ఉంటుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. పైగా వారు మనసుపెట్టి పనిచేయాలని కానీ ఎలాంటి బిజినెస్‌నైనా కూడా సక్సెస్ చేయగలరు. నిజానికి మహిళలు మొదలుపెట్టిన బిజినెస్‌లు 80 శాతం సక్సెస్ రేటుతో ఉన్నాయి. అంత ఎందుకంటే.. వాళ్లు ప్రాణం పెట్టి చేస్తారు. అందుకే ప్రభుత్వాలు కూడా మహిళలను వ్యాపారులు చేసే విధంగా లోన్లు ఇచ్చి మరీ ప్రొత్సహిస్తున్నాయి. మరి మహిళల కోసం ఒక స్పెషల్ లైఫ్ సెట్ అయ్యే బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రస్తుతం కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీకి మంచి డిమాండ్ ఉంది. ఈ బిజినెస్ ప్రారంభించేందుకు జస్ట్ ఒక ఎంబ్రాయిడరీ మిషన్ కొనుగోలు చేస్తే చాలు మహిళలు ఈ రంగంలో చక్కటి వ్యాపారం చేయవచ్చు. ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు ఇంటి వద్ద ఉంటూనే చక్కటి డిజైన్స్ రూపొందించి దుస్తులను విక్రయించవచ్చు. లేదా ఆర్డర్లను పొంది దుస్తులను తయారు చేయవచ్చు. అలాంటి ఓ చక్కటి బిజినెస్ చేయాలి అనుకున్నట్లయితే ఎంబ్రాయిడరీ మిషన్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎంబ్రాయిడరీ మిషన్స్ ప్రస్తుతం మార్కెట్లో రకరకాలుగా లభిస్తున్నాయి.
అయితే కమర్షియల్ పద్ధతిన ఎంబ్రాయిడరీ మిషన్ కొనుగోలు చేయాలి అంటే ఒక లక్ష రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటి ద్వారా చక్కటి డిజైన్స్ రూపొందించవచ్చు. మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఏ రంగు దారాలు అవసరం అవుతాయో వాటిని సిద్ధం చేసుకుంటే చాలు. నిమిషాల్లో డిజైన్ సిద్ధం అయిపోతుంది. ఎంబ్రాయిడరీ మిషన్ ఉపయోగించి నెలకు 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వం లోన్ కూడా ఇస్తుంది..
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరుద్యోగులను ఉద్దేశించి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. అందులో అత్యంత ముఖ్యమైనది ముద్ర లోన్ అని చెప్పవచ్చు. ముద్ర లోన్ ద్వారా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్యాంకులు ఎలాంటి తాకట్టు లేకుండానే రూ.50వేల నుంచి పది లక్షల వరకు రుణాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు బ్యాంకులో సైతం ముద్ర లోన్స్ అందిస్తున్నారు. ఈ ముద్ర లోన్స్ కోసం అప్లై చేసుకొని మహిళలు పైన చెప్పుకున్న బిజినెస్‌ను ప్రారంభించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

