సాధారణంగా 50, 60 ఏళ్ల హీరోలు తమకంటే తక్కువ వయసు ఉన్న హీరోయిన్లతో జతకట్టడం చూస్తుంటాం. కానీ 24 ఏళ్లు చిన్నవాడితో ఓ స్టార్ హీరోయిన్ నటించిన వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతుంది. హీరోహీరోయిన్ మధ్య వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఇద్దరు తారల మధ్య కెమిస్ట్రీ చాలా సహజంగా, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సిరీస్ IMDbలో కూడా అద్భుతమైన రేటింగ్‌ను కలిగి ఉంది. నటన, సినిమాటోగ్రఫీ మరో హైలెట్ అయ్యాయి. ఈ సిరీస్ ను విక్రమ్ సేథ్ నవల ఆధారంగా ప్రేమ, రాజకీయాలు, భావోద్వేగాల పరిపూర్ణ సమ్మేళనంగా రూపొందించారు.10 ఏళ్ల వయసులో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఈ నటుడు మరెవరో కాదు ఇషాన్ ఖట్టర్. ఐదు సంవత్సరాల క్రితం అతను బాలీవుడ్ హీరోయిన్ టబు సరసన “ఎ సూటిబుల్ బాయ్” సిరీస్‌లో కనిపించాడు. 2000లో విడుదలైన ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
ఆ సమయంలో ఇషాన్ వయసు 24, టబు వయసు 48 సంవత్సరాలు. “ఎ సూటిబుల్ బాయ్” లో టబు, ఇషాన్ ఖట్టర్ పాత్రలకు వయస్సు అంతరం ఉంది. అయినప్పటికీ వారి మధ్య కెమిస్ట్రీ, యాక్టింగ్ కు విమర్శకుల నుంచి మంచి మార్కులే వచ్చాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇషాన్ మాట్లాడుతూ.. తన కంటే పెద్ద నటితో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు ఎంతో సురక్షితంగ, ప్రశాంతంగా అనిపించిందని అన్నారు. టబు అద్భుతమైన నటి అని.. సెట్ లో ఎంతో ఉల్లాసంగా ఉంటారని చెప్పుకొచ్చారు. టబుతో నటించినప్పుడు ప్రతి సన్నివేశం సాధారణం అనిపించిందని అన్నారు. షూటింగ్ సమయంలో టబు తనతో చాలా మాట్లాడేదని ఇషాన్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..
విక్రమ్ సేథ్ రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా 1950ల భారతదేశంలో జరిగే ప్రేమ, రాజకీయాలు, కుటుంబ నాటకాల అంశాలతో తెరకెక్కించారు. అప్పట్లో ఈ సిరీస్ పై అనేక విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ IMDbలో 6.2 రేటింగ్‌ను పొందింది. దీనికి మీరా నాయర్ దర్శకత్వం వహించారు.
A Suitable Boy Series
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..

