Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Safety Pin: ఓర్ని ఇదేందిరా సామీ.. ఈ సేఫ్టీ పిన్ ఇంత కాస్టా.. కొనాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే!

7 November 2025

డ్రాగన్‌ తారక్‌.. లుక్‌ అదిరింది నీల్‌

7 November 2025

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం వరిస్తుంది.. పెళ్ళి తర్వాత లైఫ్‌స్టైల్‌ మారిపోతుందట!

7 November 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chipurupalli Station Amrit Bharat Scheme,ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్లాట్‌ఫారాల పొడగింపు – under the amrit bharat scheme the development works chipurupalli railway station are in progress
ఆంధ్రప్రదేశ్

Chipurupalli Station Amrit Bharat Scheme,ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్లాట్‌ఫారాల పొడగింపు – under the amrit bharat scheme the development works chipurupalli railway station are in progress

.By .2 November 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chipurupalli Station Amrit Bharat Scheme,ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్లాట్‌ఫారాల పొడగింపు – under the amrit bharat scheme the development works chipurupalli railway station are in progress
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం అమృత భారత్ పథకం తెచ్చింది. ఇందులో భాగంగా చీపురుపల్లి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. ఏళ్ల తరబడి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఊరట లభించనుంది. ఫ్లాట్‌ఫారాల పొడిగింపు, షెడ్ల నిర్మాణం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే స్టేషన్ కొత్త కళతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

chipurupalle railway station
చివరదశకు అభివృద్ధి పనులు(ఫోటోలు– Samayam Telugu)
దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడం కోసం ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం అమృత భారత్ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. అమృత భారత్ పథకం ద్వారా ఏపీలోని పలు స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. ఈక్రమంలోనే చీపురుపల్లి రైల్వే స్టేషన్ రూపు రేఖలు మార్చేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. అమృత భారత్ పథకంలో భాగంగా చీపురుపల్లి రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీంతో ఈ స్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు..

అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా చీపురుపల్లి రైల్వే స్టేషన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ పనులతో చీపురుపల్లి రైల్వేస్టేషన్‌ రూపురేఖలు మారబోతున్నాయి. చీపురుపల్లి, రాజాం, పాలకొండ ప్రాంతాల నుంచే కాక.. పరిసర మండలాల ప్రజలు కూడా ఈ స్టేషన్ నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఏళ్ల తరబడి స్టేషన్ అభివృద్ధికి నోచుకోకపోవడంతో.. అరకొర సౌకర్యాలతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఈక్రమంలో ప్రయాణికులు ఊరట కలిగించేలా.. చీపురుపల్లి స్టేషన్‌ను అమృత్‌ భారత్‌ పథకంలో భాగం చేశారు. దీంతో ఈ స్టేషన్‌లో అభివృద్ది పనులకు మార్గం సుగమం అయ్యింది. దీనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సార్వత్రిక ఎన్నికలకు ముందే స్టేషన్ అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అయితే ప్రారంభంలో అభివృద్ధి పనులు నిదానంగా సాగినా.. ప్రస్తుతం వేగం పుంజుకున్నాయి. దీంతో స్టేషన్‌లో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి.

దీనిలో భాగంగా స్టేషన్‌లోని మూడు ఫ్లాట్‌ఫారాలను చివరివరకు పొడిగించారు. అలానే షెడ్లు ఏర్పాటు చేసి.. గచ్చులు కూడా వేశారు.ఈ స్టేషన్‌కు వచ్చే రైళ్ల బోగీల నంబర్లు ముందుగానే ప్రయాణికులకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేశారు. అలానే స్టేషన్‌కి వచ్చే ప్రయాణికుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించగా.. దాని పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఆలానే స్టేషన్‌లో ఉన్న ఫ్లాట్‌ఫారాలపై పాత గచ్చులు తొలగించి.. వాటిని కొత్తగా నిర్మించారు. కొద్ది నెలల కిందట నిలిచిపోయిన నూతన భవన నిర్మాణ పనులను కూడా తిరిగి ప్రారంభించారు.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిధరణి పిల్లి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆమె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. ఆమెకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్థానిక వార్తలు, తెలంగాణ ఎన్నికల అప్డేట్స్, ప్రత్యేక కథనాలు రాశారు. ధరణి ఎస్ఎస్‌జే నుంచి మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు.… ఇంకా చదవండి