Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Safety Pin: ఓర్ని ఇదేందిరా సామీ.. ఈ సేఫ్టీ పిన్ ఇంత కాస్టా.. కొనాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే!

7 November 2025

డ్రాగన్‌ తారక్‌.. లుక్‌ అదిరింది నీల్‌

7 November 2025

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం వరిస్తుంది.. పెళ్ళి తర్వాత లైఫ్‌స్టైల్‌ మారిపోతుందట!

7 November 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vijayawada Bus Stand Mpdo Wife Theft Case,భర్త ఏమో MPDO.. కానీ భార్య బుద్ధి మాత్రం నీచం.. ఇదేం పని – mpdo wife caught stealing passenger purse at vijayawada bus stand police arrest her
ఆంధ్రప్రదేశ్

Vijayawada Bus Stand Mpdo Wife Theft Case,భర్త ఏమో MPDO.. కానీ భార్య బుద్ధి మాత్రం నీచం.. ఇదేం పని – mpdo wife caught stealing passenger purse at vijayawada bus stand police arrest her

.By .2 November 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vijayawada Bus Stand Mpdo Wife Theft Case,భర్త ఏమో MPDO.. కానీ భార్య బుద్ధి మాత్రం నీచం.. ఇదేం పని – mpdo wife caught stealing passenger purse at vijayawada bus stand police arrest her
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ప్రభుత్వ ఉద్యోగి భార్య, తన స్థాయిని మర్చిపోయి తోటి ప్రయాణికురాలి పర్స్ దొంగిలించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం చేసిన తర్వాత, ఆమె తన భర్తతో కలిసి వేరే బస్సులో వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ సంఘటన విజయవాడ బస్టాండ్‌లో వెలుగు చూసింది. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. నిందితురాలి భర్త అయిన ఎంపీడీవో భార్యను కాపాడే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..

హైలైట్:

  • ఎంపీడీవో భార్య చేతివాటం
  • విజయవాడ బస్టాండ్‌లో పర్స్ చోరీ
  • సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్
Guntur
ఎంపీడీవో భార్య చేతివాటం(ఫోటోలు– Samayam Telugu)
ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి. గొప్ప స్థాయిలో ఉన్నారు. అలాంటప్పుడు ఆమె ప్రవర్తన ఎంత హుందాగా ఉండాలి. నలుగురికి మంచి చెడులు చెప్పాలి. కానీ ఆమె మాత్రం తన స్థాయి మర్చిపోయి.. దిగజారి ప్రవర్తించింది. తోటి ప్రయాణికురాలి పర్స్ దొంగతనం చేసింది. ఆమె ఘనకార్యం అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ కావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే సదరు ఎంపీడీవో భార్య చేసిన తప్పును దాచే ప్రయత్నం చేశారు. ఆ వివరాలు.. ఈ సంఘటన మూడు రోజుల క్రితం విజయవాడ బస్టాండ్‌లో వెలుగు చూసింది. స్టాఫ్ నర్స్ ఒకరు విజయవాడ బస్టాండ్‌లో తన పర్స్ పోయింది అని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి.. సీసీటీవీ చెక్ చేయడంతో సదరు ఎంపీడీవో భార్య చేతి వాటం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకాం.. ఈ సంఘటన గత నెల అనగా అక్టోబర్ 29న చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలో పని చేస్తున్న ఓ ఎంపీడీఓ గుంటూరులో నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తో విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ఓ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. వీరంతా బుధవారం నాడు విజయవాడ వచ్చారు. తిరిగి మధ్యాహ్నం పీఎన్‌బీఎస్‌లో గుంటూరు బస్సులు ఆగే ప్లాట్‌ఫాం వద్దకు వచ్చారు.

అదే సమయంలో బాధిత స్టాఫ్ నర్స్ కూడా బస్ కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉంది. ఆమె దగ్గర ఉన్న పర్స్ మీద ఎంపీడీవో భార్య కన్ను పడింది. ఎలాగైనా దాన్ని కొట్టేయాలని భావించిన నిందితురాలు.. సదరు స్టాఫ్ నర్స్‌ని తోసుకుంటూ బస్ ఎక్కింది. ఈక్రమంలో పర్స్ కొట్టేసింది. ఆతర్వాత బస్ దిగి టాయిలెట్‌కి వెళ్లి వచ్చింది. వేరే బస్సులో వెళ్దామని భర్తను అడిగింది. అతడు వద్దని చెప్పి అదే బస్ ఎక్కించారు.

ఆ తర్వాత స్టాప్ నర్స్ గుంటూరులో బస్ దిగి.. బ్యాగ్ చెక్ చేసుకోగా.. ఆమె పర్స్ కనిపించలేదు. దీంతో అక్టోబర్ 30న కృష్ణలంక పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. గుంటూరు బస్టాండ్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. సదరు ఎంపీడీవో భార్య.. అదే పనిగా నర్స్ చేతిలో ఉన్న బ్యాగ్‌ను పరిశీలిస్తుండటాన్ని గమనించారు. ఎంపీడీవో కుమార్తె ధరించిన యూనిఫామ్ ఆధారంగా కాలేజీకి వెళ్లి విచారించారు. ఆమె ఫొటో చూపించగానే.. నిందితుల అడ్రెస్ తెలిసింది.

దీంతో పోలీసులు శుక్రవారం నాడు గుంటూరు వెళ్లి ఎంపీడీవో కుటుంబాన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆమె చేతి వాటం బయటపడింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. బాధితురాలు తన పర్స్‌లొ 14 గ్రాముల బంగారం, రూ.5వేలు ఉండగా.. ఫిర్యాదులో మాత్రం 4 కాసుల బంగారం, రూ.35 వేలు ఉన్నట్లు పేర్కొనడం గమనార్హం.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిధరణి పిల్లి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆమె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. ఆమెకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్థానిక వార్తలు, తెలంగాణ ఎన్నికల అప్డేట్స్, ప్రత్యేక కథనాలు రాశారు. ధరణి ఎస్ఎస్‌జే నుంచి మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు.… ఇంకా చదవండి