తమిళ చిత్రపరిశ్రమలోని టాప్ హీరోలలో అజిత్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అజిత్.. ఇప్పుడు అటు సినిమాలు.. ఇటు కార్ రేసింగ్ తో బిజీగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాకు దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ మీట్, సినిమా ప్రమోషన్స్, ఇంటర్వ్యూలకు అజిత్ విలైనంత దూరంగా ఉంటారు. తాజాగా తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి అనేక విషయాలు పంచుకున్నారు. ఇండస్ట్రీలో అభిమానులు తనకు అందించిన కీర్తికి తాను ఎప్పటికీ కృతజ్ఞుడనని అన్నారు. హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?
అజిత్ తన సినిమాల్లోని తొలి రోజులను గుర్తుచేసుకుంటూ, తాను తమిళం కూడా సరిగ్గా మాట్లాడలేని సమయం ఉందని అన్నారు. అజిత్ మాట్లాడుతూ.. “కెరీర్ మొదట్లో నేను తమిళం సరిగ్గా మాట్లాడలేకపోయాను. నా తమిళ మాట్లాడే శైలి భిన్నంగా ఉండేది. కానీ నెమ్మదిగా నేను అర్థం చేసుకున్నాను. మొదట్లో, చాలా మంది నా పేరు మార్చమని అడిగారు. ఎందుకంటే అది సాధారణ పేరు అని వారు భావించారు. కానీ నాకు వేరే పేరు వద్దు అని నేను పట్టుబట్టాను. రేసింగ్ లో నా కెరీర్ నిర్మించుకోవాలని అనుకున్నాను. అందుకే 19 ఏళ్ల కుర్రాడిగా నేను నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఉండాలి. సరైన జట్టును ఏర్పాటు చేసుకోవాలి. నేను పనిచేసే దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు అందరూ ఉండటం నా అదృష్టం. నేను వారి నుండి చాలా నేర్చుకుంటాను” అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..
” సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల తాను 29 శస్త్రచికిత్సలు చేయించుకున్నానని అజిత్ వెల్లడించాడు. అజిత్ తన విజయాలన్నింటికీ తన భార్య షాలినికి రుణపడి ఉంటానని అన్నారు. కెరీర్ మొదట్లో నేను ఎంతో కష్టపడ్డాను. కానీ ఆ క్లిష్ట సమయాల్లో నా భార్య షాలిని నాకు మద్దతుగా నిలిచింది. ఆమె లేకుండా నా జీవితంలో ఇవేవి సాధ్యం అయ్యేవి కాదు. కీర్తి , విజయాల మధ్య నా కుటుంబానికి సరిగ్గా సమయం కేటాయించలేకపోయాను ” అని చెప్పుకొచ్చారు అజిత్.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..

