Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

బిగ్‌బాస్ టైటిల్ నాదే నాన్నా.. భరణికి లీకిచ్చిన తనూజ..

17 December 2025

Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే పప్పులో కాలేసినట్లే..

17 December 2025

Grama Ward Sachivalayam Renamed Swarna Gramam,ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు.. – chandrababu announced grama ward sachivalayam will be renamed as swarna gramam in andhra pradesh

17 December 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chennai Narasapuram Vande Bharat Starting Date,చెన్నై- నరసాపురం వందేభారత్ రైలు.. ఎప్పటి నుంచి మొదలంటే.. రైల్వే కీలక ప్రకటన – vijayawada chennai vande bharat train to run to narasapuram from 2026 january 12
ఆంధ్రప్రదేశ్

Chennai Narasapuram Vande Bharat Starting Date,చెన్నై- నరసాపురం వందేభారత్ రైలు.. ఎప్పటి నుంచి మొదలంటే.. రైల్వే కీలక ప్రకటన – vijayawada chennai vande bharat train to run to narasapuram from 2026 january 12

.By .12 November 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chennai Narasapuram Vande Bharat Starting Date,చెన్నై- నరసాపురం వందేభారత్ రైలు.. ఎప్పటి నుంచి మొదలంటే.. రైల్వే కీలక ప్రకటన – vijayawada chennai vande bharat train to run to narasapuram from 2026 january 12
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


విజయవాడ చెన్నై వందేభారత్ రైలును నరసాపురం వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల నుంచి వస్తున్న ఆదరణ నేపథ్యంలో ఈ వందేభారత్ రైలును నరసాపురం వరకూ పొడిగించారు. అయితే ఎప్పటి నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయనే దానిపై ఇన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. ఈ సస్పెన్స్‌కు దక్షిణ రైల్వే క్లారిటీ ఇచ్చింది. చెన్నై సెంట్రల్ నరసాపురం వందేభారత్ రైలు ఎప్పటి నుంచి నడుస్తుందనే దానిపై ఓ ప్రకటన జారీ చేసింది.

vandebharat
చెన్నై- నరసాపురం వందేభారత్ రైలు.. ఎప్పటి నుంచి మొదలంటే.. రైల్వే కీలక ప్రకటన(ఫోటోలు– Samayam Telugu)
కోస్తాంధ్రవాసులకు రైల్వే శాఖ సంక్రాంతి కానుక ప్రకటించింది. విజయవాడ- చెన్నై వందేభారత్‌ రైలును (20677/20678) రైల్వే బోర్డు నరసాపురం వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రైలు సర్వీసులు ఎప్పట్నుంచి ప్రారంభమవుతాయనే విషయాన్ని రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 2026 జనవరి 12 నుంచి చెన్నై సెంట్రల్ నరసాపురం వందేభారత్‌ రైలు నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం చెన్నై సెంట్రల్ – విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలును జనవరి 12 నుంచి నరసాపురం వరకూ పొడిగించారు. ప్రస్తుతం ఈ వందేభారత్ రైలు చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో ఉదయం 5 గంటల 30 నిమిషాలకు బయల్దేరుతుంది. రేణిగుంట, గూడూరు, నెల్లూరు రైల్వేస్టేషన్, ఒంగోలు, తెనాలి రైల్వేస్టేషన్ల మీదుగా విజయవాడకు మధ్యాహ్నం 11 గంటల 40 నిమిషాలకు చేరుకుంటుంది.

అయితే రైల్వే బోర్డు తాజాగా నరసాపురం వరకూ ఈ వందేభారత్ రైలును పొడిగించటంతో జనవరి 12వ తేదీ నుంచి ఈ వందేభారత్ రైలు గుడివాడ, భీమవరం రైల్వేస్టేషన్ల మీదుగా నరసాపురం వరకు నడవనుంది. విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి 11.45కి బయల్దేరి.. గుడివాడ రైల్వేస్టేషన్‌కు మధ్యాహ్నం 12.29కు చేరుకుంటుంది. మధ్యాహ్నం 1.14కి భీమవరం రైల్వే స్టేషన్‌కు చేరుకోనున్న ఈ రైలు.. నరసాపురం రైల్వేస్టేషన్‌కు 2.10కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు నరసాపురం నుంచి మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరనుంది. 3.19కి భీమవరం రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. గుడివాడ రైల్వేస్టేషన్‌కు సాయంత్రం 4.04కి, విజయవాడ రైల్వేస్టేషన్‌కు 4.50కి చేరుతుంది. విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి సాయంత్రం 4.55 గంటలకు బయల్దేరితే.. చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు రాత్రి 11.45గంటలకు చేరుకుంటుంది.

మరోవైపు వందేభారత్ రైళ్లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో.. నరసాపురం వరకూ ఈ రైలు సర్వీసును పొడిగిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. మరోవైపు విజయవాడ బెంగళూరు వందేభారత్ రైలును కూడా నవంబర్ నెలాఖరులో ప్రారంభిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ రైలు కోసం చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది. విజయవాడ బెంగళూరు మార్గంలో కొండవీటి ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం రాకపోకలు సాగిస్తోంది.

అయితే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు వారంలో కేవలం మూడ్రోజులే అందుబాటులో ఉంటోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని విజయవాడ బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభించే ఆలోచన చేశారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే 9 గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు చేరుకునే అవకాశం ఉంది. తిరుపతి మీదుగా ఈ రైలు రాకపోకలు సాగించనుంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి