Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Health Tips: ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ​​కానీ రాంగ్‌ టైమ్‌లో తిన్నారంటే.. ఇక అంతే సంగతులు!

24 January 2026

‘మద’ ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం

24 January 2026

రూ. 78 లక్షల హాస్పిటల్‌ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI

24 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Hyderabad Vijayawada Special Trains,Special Trains: రైలు ప్రయాణికులకు సూపర్ న్యూస్.. హైదరాబాద్ – విజయవాడ మధ్య అదనపు ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే.. – south central railway operates hyderabad vijayawada sankranti special additional trains
ఆంధ్రప్రదేశ్

Hyderabad Vijayawada Special Trains,Special Trains: రైలు ప్రయాణికులకు సూపర్ న్యూస్.. హైదరాబాద్ – విజయవాడ మధ్య అదనపు ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే.. – south central railway operates hyderabad vijayawada sankranti special additional trains

.By .7 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Hyderabad Vijayawada Special Trains,Special Trains: రైలు ప్రయాణికులకు సూపర్ న్యూస్.. హైదరాబాద్ – విజయవాడ మధ్య అదనపు ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే.. – south central railway operates hyderabad vijayawada sankranti special additional trains
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ విజయవాడ మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు ప్రత్యేక రైలు సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు సర్వీసు జనవరి 9, 10, 18వ తేదీలలో అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. హైదరాబాద్ విజయవాడ ప్రత్యేక రైలు హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6:10 గంటలకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి మధ్యాహ్నం 2: 40 గంటలకు బయల్దేరుతుంది.

Sankranti special trains
హైదరాబాద్ విజయవాడ ప్రత్యేక రైలు(ఫోటోలు– Samayam Telugu)
సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త వినిపించింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు.. రైళ్లల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ మార్గాల్లో ఎనిమిది అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ – విజయవాడ, హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య అదనపు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది.

హైదరాబాద్ విజయవాడ ప్రత్యేక రైలు

07471 నంబరుతో హైదరాబాద్ – విజయవాడ మార్గంలో శుక్ర, శనివారాల్లో (జనవరి 9, 10)అదనపు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైలు హైదరాబాద్ నుంచి ఉదయం 6 గంటల 10 నిమిషాలకు బయల్దేరుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటా 40 నిమిషాలకు విజయవాడ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. అలాగే విజయవాడ – హైదరాబాద్ మార్గంలో జనవరి 9, 18 తేదీలలో అదనపు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. విజయవాడ హైదరాబాద్ అదనపు ప్రత్యేక రైలు (07472) విజయవాడ నుంచి మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు బయల్దేరుతుంది. రాత్రి 10 గంటల 35 నిమిషాలకు హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ చేరుకుంటుందని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.. హైదరాబాద్ డెక్కన్ – విజయవాడ – హైదరాబాద్ డెక్కన్ రైలు (07471/07472) సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, ఘన్‌పూర్, ఖాజీపేట, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర స్టేషన్ల మీదుగా విజయవాడకు చేరుకుంటుంది. ఈ రైలులో అన్ని జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది.

హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ప్రత్యేక రైలు

అలాగే హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య జనవరి 9, 10వ తేదీలలో అదనపు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంది. హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ రైలు (07469) ఉదయం 7 గంటల 55 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయల్దేరుతుంది. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకుంటుంది. ఇక సిర్పూర్ కాగజ్ నగర్ – హైదరాబాద్ మధ్య జనవరి 9, 18 వ తేదీలలో ప్రత్యేక రైలు అందుబాటులో ఉంది. సిర్పూర్ కాగజ్ నగర్ – హైదరాబాద్ ప్రత్యేక రైలు ( 07470) సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు బయల్దేరుతుంది. రాత్రి 10 గంటల 20 నిమిషాలకు హైదరాబాద్ డెక్కన్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.

హైదరాబాద్ డెక్కన్ – సిర్పూర్ కాగజ్ నగర్ – హైదరాబాద్ డెక్కన్ రైలు (07469/07470) సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, ఆలేరు, జనగాం, ఘన్‌పూర్, ఖాజీపేట్, ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, రవీంద్ర ఖని, మందమర్రి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఇందులో కూడా అన్నీ జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఏర్పాటు చేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి