Venu Swamy Comments On Chandrababu And Nara Lokesh: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న వేణుస్వామి.. 2026లో ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాష్ట్రపతి కావడం లేదని, ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోకేష్‌కు పదోన్నతి, పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఖాయమని జోస్యం చెప్పారు. జగన్‌కు 2026లో అంతా పాజిటివ్‌గా ఉంటుందని, అయితే 2029 వరకు సీఎం అయ్యే అవకాశాలు లేవని తెలిపారు.
హైలైట్:
- ఏపీ రాజకీయాలపై వేణు స్వామి కామెంట్స్
- చంద్రబాబు ఆరోగ్య విషయంలో జాగ్రత్త
- లోకేష్‌కు 2026లో పదన్నోతి దక్కుతుంది
- పవన్ కళ్యాణ్ జాతకం సూపర్‌గా ఉంది
- వైఎస్ జగన్‌కు పాజిటివ్‌గానే ఉందన్నారు

‘మంత్రి నారా లోకేష్‌కు 2026లో పదోన్నతి కనిపిస్తోంది.. డిప్యూటీ సీఎం కావొచ్చు. ఏపీలో మరో డిప్యూటీ సీఎం ఉంటే తప్పేముంది. 2026లో లోకేష్‌కు అప్‌గ్రేడ్ కనిపిస్తోంది. .ఆయన ఉన్నస్థాయి నుంచి మరో మెట్టు ఎక్కుతారు.. లోకేష్ అభిమానులకు పండగే. 2026 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సూపర్‌గా ఉంది.. కేటీఆర్, పవన్ కళ్యాణ్‌లది మకర రాశి. పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఏపీలో కూటమి పార్టీల్లో ఎలాంటి సమస్యలు రావు. 2026లలో ఎలాంటి ఇబ్బందులు లేవు. 2027లో సంచనాలు ఉంటాయని అంచనా వేస్తున్నాను. 2029 వరకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు.. ఆ తర్వాత చూద్దాం. ఆ తర్వాత జాతకాలు మారిపోతాయి’ అన్నారు.
‘ప్రతి రెండున్నరేళ్లకు ఒకసారి జాతకాలు మారతాయి. జాతకాలు మారినప్పుడు మాట్లాడితే బావుంటుంది. 2027, 2028, 2029లో ఎలా ఉంటుంది ముందే చెప్పలేను.. అప్పటి జాతకాలు, పంచాంగం, వ్యక్తిగత విషయాలను విశ్లేషించి చెప్పగలను. క్రికెట్, ఎన్నికల ఫలితాలు, ప్రెగ్‌నెన్సీ గురించి జాతకాలు చెప్పను.. ఈ మూడింటి గురించి చెప్పను. ఈ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందని నేను చెప్పదలచుకోలేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు 2026లో పాజిటివ్‌గా ఉంటుంది. ఆయనది మిధున రాశి.. ఆయనకు పాజిటివ్‌గానే ఉంది. ఆయన వెళితే జనాలు రోడ్డు మీదకు వస్తున్నారు.. ఆయనకు అదే కావాలి. 2026లో పెద్దగా మార్పులేవీ ఉండవు’ అని చెప్పుకొచ్చారు.


