Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

UPSC Civils 2025 Interview Date: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ తేదీల షెడ్యూల్‌ మారిందోచ్‌.. కొత్త తేదీ ఇదే

17 January 2026

Saturday astrology: శనివారం పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు.. ఏం చేయాలో తెలుసా?

17 January 2026

Anasuya: పద్దతిగా ఉండాలని చెబితే కేసు పెడతారా? : సంధ్యా రెడ్డి

17 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»పవన్ కళ్యాణ్ జాగ్రత్త.. నేను ఒక్క ప్రార్థన చేస్తే చనిపోతావ్: కేఏ పాల్ – ka paul sensational comments on ap deputy cm pawan kalyan and ysr death
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ జాగ్రత్త.. నేను ఒక్క ప్రార్థన చేస్తే చనిపోతావ్: కేఏ పాల్ – ka paul sensational comments on ap deputy cm pawan kalyan and ysr death

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
పవన్ కళ్యాణ్ జాగ్రత్త.. నేను ఒక్క ప్రార్థన చేస్తే చనిపోతావ్: కేఏ పాల్ – ka paul sensational comments on ap deputy cm pawan kalyan and ysr death
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Ka Paul Comments On Pawan Kalyan: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శాపం వల్లే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవుని భయంతో బతకాలని హెచ్చరించారు. కవిత కూడా ‘బీ-టీమ్’గా మారుతున్నారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా తనకు 200 కోట్ల మంది అభిమానులున్నారని, తనను అంతం చేయాలని చూసినవారు దారుణంగా చనిపోయారని పాల్ తెలిపారు.

హైలైట్:

  • పవన్ కళ్యాణ్‌పై కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు
  • తాను ప్రార్థన చేస్తే చనిపోతావ్ అంటూ శాపనార్థం
  • గతంలో వైఎస్ కూడా అలాగే చనిపోయారంటూ
Ka Paul
పవన్ కళ్యాణ్‌పై కేఏ పాల్(ఫోటోలు– Samayam Telugu)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పవన్‌ కళ్యాణ్ జాగ్రత్త.. నేను ఒక్క ప్రార్థన చేస్తే రాజశేఖర్‌రెడ్డిలా చనిపోతావు’ అన్నారు. తన శాపం కారణంగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009 ఆగస్టులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తన చారిటీ సంస్థలకు చెందిన 14 బ్యాంకు అకౌంట్‌లను మూసివేసిందని చెప్పుకొచ్చారు. తాను ఉపవాసం ఉండి కన్నీళ్లతో సెప్టెంబర్ 1న ప్రార్థన చేశానని.. సెప్టెంబర్ 2న వైఎస్సార్ హెలికాప్టర్ కూలిపోయిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 58 కేసులు పెడితే 57 వీగిపోయాయన్నారు.. అప్పటి ఒక్క కేసు కూడా త్వరలో క్లీన్ చిట్ వస్తుందన్నారు.

ఏపీ, తెలంగాణ సీఎంలకు వార్నింగ్

‘తెలంగాణను పాలిస్తుంది ఎవరు.. రేవంత్ రెడ్డా లేక చంద్రబాబా.. చంద్రబాబు చెప్పిందే రేవంత్ చేస్తున్నారు. మీ గుండెలు ఆగిపోకముందే, మీకు యాక్సిడెంట్లు అవ్వకముందే దేవుని భయంతో బతకండి. లేదంటే సర్వనాశనం తప్పదు’ అంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా టార్గెట్ చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతారని తాను ముందే చెప్పానన్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీకి, షర్మిల కాంగ్రెస్‌కు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎఆర్‌ఎస్‌కు అమ్ముడుపోతారని కూడా తాను ముందే చెప్పానన్నారు. ఇప్పుడు కవిత కూడా ఎవరికో ఒకరికి ‘బీ-టీమ్’గా మారుతున్నారని ఆరోపించారు.. ఆమె ఓ ప్యాకేజ్ స్టార్ అన్నారు. ప్రజాశాంతి పార్టీలో ఎప్పటి నుంచో నమ్మకంగా ఉన్న ప్రభాకర్‌ను పార్టీ ‘నేషనల్ కోఆర్డినేటర్‌’గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

వాళ్లంతా నాకు 30 రోజుల్లో క్షమాపణలు చెప్పాలి

ప్రపంచవ్యాప్తంగా తనకు 200 కోట్ల మంది అభిమానులు ఉన్నారని చెప్పుకొచ్చారు పాల్. ప్రధాని మోదీ వంటి ప్రముఖులు కూడా తనను గౌరవిస్తారన్నారు. తనను అంతం చేయాలని చూసినవారు దారుణంగా చనిపోయారని.. తన దేవుడి శక్తి ముందు ఎవరూ నిలబడలేరు అన్నారు. వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రాత్రికి రాత్రే ఒక దొంగలా కిడ్నాప్‌ చేయించారని పాల్ ఆరోపించారు. ఈ పరిణామాలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ప్రపంచమంతా శాంతిని కోరుకుంటుందని, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అమెరికాలో చర్చలు జరిగాయని పాల్ తెలిపారు. తాను శాంతి కోసం ప్రార్థిస్తున్నానని, గద్దర్‌ చనిపోలేదని, అతన్ని చంపేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని, 30 రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేఏ పాల్ హెచ్చరించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి