Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ముద్దుగుమ్మల ఆశలు అడియాశలు.. సంక్రాంతికి అనుకోని షాక్

24 January 2026

Health Tips: ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ​​కానీ రాంగ్‌ టైమ్‌లో తిన్నారంటే.. ఇక అంతే సంగతులు!

24 January 2026

‘మద’ ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం

24 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Team India: టీమిండియాకు బిగ్ షాక్.. తెలుగబ్బాయ్‌కి ఎమర్జెన్సీ సర్జరీ.. టీ20 వరల్డ్‌ కప్‌నకు డౌటే..?
తాజా వార్తలు

Team India: టీమిండియాకు బిగ్ షాక్.. తెలుగబ్బాయ్‌కి ఎమర్జెన్సీ సర్జరీ.. టీ20 వరల్డ్‌ కప్‌నకు డౌటే..?

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. తెలుగబ్బాయ్‌కి ఎమర్జెన్సీ సర్జరీ.. టీ20 వరల్డ్‌ కప్‌నకు డౌటే..?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tilak Varma Surgery: టీమిండియా యువ బ్యాటర్, ఆసియా కప్ హీరో తిలక్ వర్మ ఒక్కసారిగా ఆసుపత్రి పాలవ్వడం క్రీడా లోకాన్ని షాక్‌కు గురిచేసింది. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న అతనికి అత్యవసరంగా సర్జరీ నిర్వహించారు. దీంతో రానున్న న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026కు అతను అందుబాటులో ఉంటాడా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.

హైదరాబాద్ స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నాడు. రాజ్‌కోట్‌లో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న సమయంలో అతనికి అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి (అబ్డామినల్ పెయిన్) వచ్చింది. వెంటనే టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి ‘టెస్టిక్యులర్ టోర్షన్’ (Testicular Torsion) అనే సమస్య ఉన్నట్లు గుర్తించి, వెంటనే శస్త్రచికిత్స అవసరమని సూచించారు. బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో అతనికి సర్జరీ విజయవంతంగా పూర్తయింది.

Video: 38 ఇన్నింగ్స్‌ల్లో 13 సెంచరీలు, 13 ఫిఫ్టీలు.. ఈ విధ్వంసం కనిపిస్తలేదా గంభీర్.. అరంగేట్రం ఛాన్స్ ఇంకెప్పుడు?

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్ సిరీస్‌కు దూరం..

జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ దాదాపు దూరమయ్యాడు. గత ఏడాది కాలంగా టీ20ల్లో తిలక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో అతను ఆడిన 69 పరుగుల అజేయ ఇన్నింగ్స్ అతన్ని జట్టులో కీలక ఆటగాడిగా మార్చింది. ఇటువంటి సమయంలో అతను దూరమవ్వడం జట్టు సమతూకాన్ని దెబ్బతీసే అంశం.

ఇది కూడా చదవండి: IND vs NZ: తొలి వన్డే నుంచి రోహిత్‌ ఔట్.. కన్నింగ్ గేమ్ మొదలెట్టేసిన గంభీర్.. ప్లేయింగ్ 11లో షాకింగ్ మార్పు?

వరల్డ్ కప్ ముంగిట ఆందోళన..

ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ఇంకా నెల రోజులు కూడా సమయం లేదు. వైద్యుల సమాచారం ప్రకారం, ఈ సర్జరీ తర్వాత కోలుకోవడానికి కనీసం 3 నుంచి 4 వారాల సమయం పడుతుంది. దీనివల్ల వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్‌లకు తిలక్ అందుబాటులో ఉండటం కష్టమని తెలుస్తోంది. ఫిట్‌నెస్ సాధించినా, మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం సెలెక్టర్లకు సవాలుగా మారనుంది.

ఇది కూడా చదవండి: టీ20ల్లో విధ్వంసం అంటే ఇదే.. 38 సిక్సర్లు, 53 ఫోర్లు.. 549 పరుగులతో అన్ బ్రేకబుల్ రికార్డ్..

ప్రత్యామ్నాయం ఎవరు?

తిలక్ వర్మ స్థానంలో న్యూజిలాండ్ సిరీస్‌కు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. శ్రేయస్ అయ్యర్ లేదా రియాన్ పరాగ్‌లకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అయితే శుభ్‌మన్ గిల్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

తిలక్ వర్మ త్వరగా కోలుకుని వరల్డ్ కప్‌లో భారత్ తరపున బరిలోకి దిగాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ముద్దుగుమ్మల ఆశలు అడియాశలు.. సంక్రాంతికి అనుకోని షాక్

24 January 2026

Health Tips: ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ​​కానీ రాంగ్‌ టైమ్‌లో తిన్నారంటే.. ఇక అంతే సంగతులు!

24 January 2026

‘మద’ ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం

24 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ముద్దుగుమ్మల ఆశలు అడియాశలు.. సంక్రాంతికి అనుకోని షాక్

24 January 2026

పండగ సినిమాలు వస్తాయి.. మా కెరీర్‌కు పండగ తీసుకొస్తాయని కలలుగన్న ఆ హీరోయిన్లకు మరోసారి నిరాశే ఎదురైంది. స్టార్ హీరోలున్నా…

Health Tips: ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ​​కానీ రాంగ్‌ టైమ్‌లో తిన్నారంటే.. ఇక అంతే సంగతులు!

24 January 2026

‘మద’ ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం

24 January 2026

రూ. 78 లక్షల హాస్పిటల్‌ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI

24 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ముద్దుగుమ్మల ఆశలు అడియాశలు.. సంక్రాంతికి అనుకోని షాక్

24 January 2026

Health Tips: ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ​​కానీ రాంగ్‌ టైమ్‌లో తిన్నారంటే.. ఇక అంతే సంగతులు!

24 January 2026

‘మద’ ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం

24 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.