ముఖ్యంగా చికెన్, లేదా మటన్ వంటి నాన్‌వెజ్ ఆహారాలు తిన్నప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు అజీర్ణం, మంట, గ్యాస్, చర్మ సమస్యల వంటి వాటికి దారి తీస్తాయి. మటన్‌లో ప్రోటిన్, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే మటన్ తిన్న వెంటనే కొన్ని ఆహారాలను తీసుకోవడం నివారించాలి. లేదంటే అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు.

